India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జీడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం నెక్కొండ మండలంలో 81 పోలింగ్ కేంద్రాలు, రాయపర్తిలో 78, పర్వతగిరి-68, సంగెం-66, దుగ్గొండి-65, చెన్నారావుపేట-55, నల్లబెల్లి-53, గీసుకొండ-48, ఖానాపురం-48, వర్ధన్నపేట-47, నర్సంపేట మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
వరంగల్ జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈసారి చర్యలు చేపట్టాలన్నారు.
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HNK జిల్లా ఐనవోలు మండలంలోని గరిమెళ్లపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా పాడి పశువులపై హైనా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి మళ్లీ పొలం వద్ద ఉన్న ఎడ్లపై దాడి చేయడంతో కొమ్ములతో హైనాలను పొడవపోయాయి. ఈ క్రమంలో ఎడ్లకు పలుచోట్ల గాయాలు అయ్యాయి. పాక వద్ద పడుకున్న ప్రభాకర్ వివరాల ప్రకారం.. రెండు హైనాలు వచ్చాయి. తనపై కూడా దాడి చేయగా కర్రలతో బెదిరించినట్లు తెలిపాడు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే ఈరోజు తేజ మిర్చి ధర తగ్గగా మిగతా మిర్చి ధరలు పెరిగాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ.13,400 పలకగా.. నేడు రూ.13,200 పలికింది. అలాగే 341 మిర్చికి నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.13,350 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.14,100 ధర రాగా.. ఈరోజు రూ.14,200కి చేరింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హనుమకొండకు రానున్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు చేరుకొని ఆ తర్వాత HNKలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. దీంతో పార్టీ శ్రేణులు భారీగా హనుమకొండకు చేరుకుంటున్నాయి. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
హనుమకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
ఓరుగల్లు జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతుందని ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్నగర్(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.