Warangal

News September 23, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News September 22, 2024

పెద్దవంగర: అప్పుల బాధతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. SI క్రాంగి కిరణ్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 22, 2024

UPDATE.. జనగామ: తల్లిని చంపిన కొడుకు

image

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కొడుకు <<14155815>>తల్లిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సతీశ్ తల్లితో గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్, భూమి, డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. ఈక్రమంలో తల్లి లక్ష్మిని రోకలిబండతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

News September 22, 2024

WGL: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు.

News September 21, 2024

జనగామ: పీఆర్ పెండింగ్ పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

image

పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అక్టోబర్ 15 కల్లా పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు ఇంజనీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలన్నారు.

News September 21, 2024

WGL: అండర్-19 జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి వరంగల్ అండర్-19 జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈనెల 22, 23వ తేదీల్లో సికేఎం కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. 2005 సెప్టెంబర్-1 తరువాత జన్మించిన ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ యూనిఫాం, స్వంత కిట్, ఇతర పత్రాలతో హాజరుకావాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ కోరారు.

News September 21, 2024

గీసుగొండ: కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత: టీపీసీసీ అధ్యక్షుడు

image

కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, ఇతర నేతలు నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

News September 21, 2024

BREAKING.. జనగామ: తల్లిని చంపిన కుమారుడు

image

జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కుమారుడు తల్లిని చంపాడు. స్థానికుల ప్రకారం.. కుమారుడు సత్తయ్య తల్లి సముద్రాల లక్ష్మమ్మ(65)ను రోకలిబండతో కొట్టి చంపాడు. అయితే సత్తయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం లేనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 21, 2024

జనగామ: కుటుంబ కలహాలతో తల్లీ, కూతురు ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో కూతురితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ CI శ్రీను, SI కృష్ణారెడ్డి వివరాలు.. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన రాజేశ్వర్, శారద ఉపాధికోసం బెజ్జంకి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త.. తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన శారద కూతురితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

News September 21, 2024

క్యాబినెట్‌కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

image

ఏటూరునాగారం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.