Warangal

News September 21, 2024

ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా

image

అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.

News September 21, 2024

అక్టోబర్ 3 నుంచి 13 వరకు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

image

శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవి శరన్నవరాత్రి(దసరా) మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి తెలిపారు. అక్టోబర్ 12 విజయదశమి దసరా సందర్భంగా భద్రకాళి తటాకంలో హంస వాహన తెప్పోత్సవం, అక్టోబర్ 13 శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

News September 20, 2024

వరంగల్ మార్కెట్లో పసుపు, పల్లికాయ ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సూక పల్లికాయ(పాతది) ధర రూ.6వేలు పలకగా, సూక పల్లికాయ(పచ్చిది) రూ.5,780, పచ్చి పల్లికాయ రూ.4, 600 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపుకి రూ.11,859 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.

News September 20, 2024

BREAKING.. వరంగల్ రైల్వే స్టేషన్లో NO STOP

image

వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద 39 రైళ్లకు SEP 25 నుంచి 28 వరకు నో స్టాప్ వర్తిస్తుందని HYD సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. హసన్‌పర్తి, కాజీపేట, వరంగల్, విజయవాడ-వరంగల్ మార్గంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు ట్రైన్లకు కాజీపేట ఆల్టర్నేటివ్ స్టాప్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని ట్రైన్లను డైవర్ట్ చేశారు.

News September 20, 2024

వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి: అదనపు ఎస్పీ

image

MHBD జిల్లా పరిధిలోని సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ వాహనాల పనితీరు నిర్వహణను అడిషనల్ ఎస్పీ చెన్నయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు వాహనాలను నిరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు.

News September 20, 2024

కాంగ్రెస్ ప్రభుత్వానికి అవమానం: ‘X’లో KTR

image

వరంగల్ <<14142693>>MGMలో అంబులెన్స్<<>> అందుబాటులో లేకపోవడం అమానుషమని మాజీ మంత్రి KTR అన్నారు. గురువారం జ్వరంతో మృతి చెందిన గీతిక(6)ను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడంపై ఆయన ‘X’లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అవమానం అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రులను మరణ ఉచ్చులుగా మార్చడమే గాక.. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్, CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమని మండిపడ్డారు.

News September 20, 2024

వరంగల్: ఎంజీఎంను గాడిన పెట్టేందుకు చర్యలు

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీలు, అడపా దడపా మంత్రుల రివ్యూలతో ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ ఏర్పడుతోంది. ఇప్పటికే ఎంజీఎంలో పదికి పైగా ఫిర్యాదుల పెట్టేలను ఏర్పాటు చేశారు. వాటిని కలెక్టర్ స్వయంగా తెరిచి సమస్యలు తెలుసుకోనున్నారు. ఓపీ కౌంటర్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 20, 2024

వరంగల్: తగ్గుతున్న పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. గురువారం కొంత పెరిగి రూ. 7,850 చేరగా నేడు మళ్లీ తగ్గి రూ.7,825 అయిందని అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.

News September 20, 2024

కేయూ కాంట్రాక్టు లెక్చరర్‌పై మరో ఫిర్యాదు

image

కేయూ కాంట్రాక్టు లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్‌పై మరో మహిళ పార్ట్ టైమ్ లెక్చరర్ ఫిర్యాదు చేశారు. బదిలీ విషయంలో వేధిస్తూ అడ్డుకుంటున్నాడని తెలుగు డిపార్ట్‌మెంట్ లెక్చరర్ అన్నపూర్ణ అతడిపై గురువారం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు ఇచ్చారు.కాగా ఈ నెల 16న తెలుగు డిపార్ట్‌మెంట్ HOD జ్యోతి తనను శ్రీధర్ కుమార్ లోథ్ మానసికంగా వేధిస్తున్నాడని రిజిస్ట్రార్‌‌కు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

News September 20, 2024

మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేత

image

రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.