Warangal

News August 9, 2024

HNK: పైపులో ఇరుక్కుపోయిన కుక్క తల

image

ఆహారం కోసం ఎదురు చూస్తూ పైపులో కుక్క తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయి 3 రోజులు నరకయాతన అనుభవించింది. HNK శ్యామల దుర్గాదాస్ కాలనీలో మూడు రోజుల కిందట రోడ్డు పక్కన పడి ఉన్న ప్లాస్టిక్ పైపులో కుక్క తల దూర్చింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడంతో అరుస్తూ వీధుల్లో సంచరించింది. వడ్డేపల్లి పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ కుక్కకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పైపు కోసి కుక్కను రక్షించారు.

News August 9, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన WH మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,000 పలికింది. అలాగే 341 రకం మిర్చికి సైతం నిన్నటి లాగే కూడా రూ.14 వేలు పలికింది. అయితే వండర్ హాట్(WH) మిర్చి ధర మాత్రం నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. నిన్న రూ.14,500 పలికిన మిర్చి నేడు రూ.15,500కి చేరింది.

News August 9, 2024

వరంగల్: పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిచ్చాయి. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు పెరిగాయి. సోమవారం రూ.7,160 పలికిన పత్తి.. మంగళవారం, బుధవారం రూ.7,100, గురువారం మరింత తగ్గి రూ.7055కి చేరింది. ఐతే ఈరోజు రూ.7,130కి పెరిగింది. దీంతో అన్నదాతలకు కొంత ఉపశమనం కలిగినట్లు అయింది.

News August 9, 2024

నర్సంపేట: డెంగ్యూతో బాలిక మృతి

image

డెంగ్యూ లక్షణాలతో చిన్నారి మృతి చెందిన ఘటన నర్సంపేట పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సంపేటలోని రాంనగర్‌కు చెందిన గండికోట స్వరూప-వెంకట్ దంపతులకు అనూష, నందిని ఇద్దరు కుమార్తెలు. కేసముద్రం కేజీబీవీలో 7వ తరగతి చదువుతున్న నందిని(12)కి ఇటీవల డెంగ్యూ వచ్చింది. వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు చెప్పారు.

News August 9, 2024

యావత్ దేశం గర్వపడేలా చేసింది: మంత్రి

image

భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించినందుకు సంతోషంగా ఉందని, భారత హాకీ జట్టు ఈ విజయంతో యావత్ దేశం గర్వపడేలా చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. క్రీడారంగ బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ‘X’లో మంత్రి ట్వీట్ చేశారు.

News August 8, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

> BHPL: గంజాయి పట్టివేత
> WGL: అక్రమ సంబంధం గురించి అడిగితే.. కర్రతో దాడి, మృతి
> MHBD: బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు మృతి
> MLG: డెంగ్యూతో వివాహిత మృతి
> HNK: సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు
> MHBD: దుర్గమ్మ ఆలయంలో చోరీ
> WGL: కామెర్లతో తల్లి బిడ్డ మృతి
> JN: మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

News August 8, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> MHBD: భార్యకు గుడి కట్టించిన భర్త
> WGL: ఖిలా వరంగల్ కోటను సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్
> MLG: చిన్నతనం నుంచి పోరాటాలు చేస్తూనే పెరిగాను: సీతక్క
> JN: ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తా: కడియం శ్రీహరి
> WGL: మార్కెట్లో తగ్గిన మిర్చి, పత్తి ధరలు
> HNK: జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం
> WGL: ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు: సీపీ

News August 8, 2024

జనగామ సీఐగా దామోదర్ రెడ్డి నియామకం

image

జనగామ సీఐగా దామోదర్ రెడ్డి నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్దిరోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ రఘుపతి రెడ్డిని, ఎస్సై తిరుపతిని, కానిస్టేబుల్ కరుణాకర్‌ను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. సీఐ రఘుపతి రెడ్డి స్థానంలో దామోదర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెల్లడించారు. 

News August 8, 2024

WGL: అక్రమ సంబంధం గురించి అడిగితే.. కర్రతో దాడి, మృతి

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ పరిధిలోని తక్కళ్లపాడు గొత్తికోయ గూడేనికి చెందిన మంగమ్మను కమల అనే <<13808022>>మహిళ కర్రతో<<>> కొట్టడంతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నవంటూ గ్రామానికి చెందిన కమలను మంగమ్మ తిట్టడంతో కమల కోపంతో మంగమ్మను వెదురు కర్రతో కొట్టింది. ఈ క్రమంలో మంగమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 8, 2024

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో లక్ష పత్రి పూజలు

image

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో లక్ష్యపత్రి పూజలను గురువారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. లక్ష పత్రి పూజలు చేయడం ద్వారా గురువారం రూ.85,000 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.