India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షం ధాటికి మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అయింది. వర్షం దంచి కొట్టడంతో ప్రజలు వణుకుతూ ఇళ్లలోనే తలదాచుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పోలీసులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రయాణికులకు ఆహారం, మంచినీటిని అందజేసి మానవత్వం చాటుకున్నారు.
ప్రముఖ రియలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 ఆదివారం మొదలైంది. ఇందులో వరంగల్‌కు చెందిన నబీల్ అఫ్రిది చోటు దక్కించుకున్నాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంతే ఇష్టం. కాగా, నబీల్ వరంగల్ డైరీస్ యూట్యూజ్ ఛానల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో కేసముద్రం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ-వరంగల్ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది త్వరితగతిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
> MHBD: సలాం పోలీసన్న.. జోలె కట్టి వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు
> WGL: జిల్లా వ్యాప్తంగా వర్షం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు
> MLG: లక్నవరం వేలాడే వంతెన పైకి వరద
> MHBD: భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> MLG: బొగతా జలపాతం ఉగ్రరూపం
> HNK: విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: ఎమ్మెల్సీ
> MHBD: రాళ్లవాగులో చిక్కుకున్న డీసీఎం
> JN: వరద ప్రవాహంలో గల్లంతయిన మేకలు
భారీ వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో సోమవారం అన్ని యూనివర్సిటీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి తెలిపారు. అదేవిధంగా అన్ని డిగ్రీ, పిజి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది పరీక్షల నియంత్రణ అధికారి ద్వారా తెలియజేస్తామన్నారు.
2022, 2023లో వచ్చిన జంపన్న వాగు వరదలను, వాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వరదల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే ప్రతి మండలానికి ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రెండు నెలల ముందే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తుగా అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి సీతక్క అన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆదివారం వరంగల్ నగరంలోని బీఆర్ నగర్, బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, పద్మా నగర్, సాయి గణేశ్ కాలనీలో క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వరదలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మండల వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. దీంతో మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
అల్పపీడన ద్రోణితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అన్నారు. విద్యుత్ పోల్సు ముట్టుకోరాదని తెలిపారు. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దన్నారు. సహాయం కొరకు 040-21111111 మరియు 9000113667 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి సురేఖ పోస్ట్ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబాబాద్, ములుగు, తొర్రూరు, ఏటూరునాగారం, బయ్యారం, గార్ల, కొత్తగూడ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. వాగులు, చెరువుల దగ్గర అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.