India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
WGL జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద చైర్ పర్సన్ హోదాలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీలతో కలిసి జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను అనారోగ్య సమస్యల నుంచి రక్షించాలని వైద్యశాఖ అధికారులను సూచించారు.
మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం రేపింది. గ్రామ శివారులో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక జేసీబీ , రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత మరో అధికారిపై వేటు వేశారు. వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ ప్రభుత్వం వేటు వేసిన తెలిసిందే. కాగా ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. రాబోయే ఎన్నికల కోసం ఇటీవల పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల మార్పులను ప్రభుత్వానికి పంపించారు. గత ఎన్నికల్లో 16 జడ్పీటీసీ, 178 స్థానాలు ఉండేవి. హనుమకొండ, వరంగల్ జిల్లాల పునర్విభజన, ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో 8 గ్రామాల విలీనమయ్యాయి. దీంతో వరంగల్ జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 నుంచి 20 వరకు 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హనుమకొండ, జనగామ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. జఫర్‌గడ్ మండలంలో వీరు “మా ఇల్లు ఆశ్రమంలో” అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అనంతరం ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిర్వహించారన్నారు. ప్రతి రోజు ఉ.9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.