India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి వ్యక్తి గాయాలపాలైన ఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాజ్ కుమార్ అనే వ్యక్తి కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపైకి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎంకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈనెల 16న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 16 నుంచి 17 వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం తెలిపారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా వైన్స్‌లను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలా గొప్పదని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. ఆనకట్టలు, రహదారులు, వంతెనలు నిర్మించి దేశ ప్రగతిని ఇంజనీర్లు పరుగులు పెట్టించారని,తమ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఇంజినీర్లు పనిచేయాలని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ములకలపల్లిలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులను వరద నష్టం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
ఇటీవల కురిసిన వర్షాలు జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టవివరాలను అందజేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో జిల్లాకు రూ.3కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట అంచనా తయారు చేయాలని ఆమె సూచించారు.
దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని, దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని అన్నారు.
జనగామ కలెక్టర్ కార్యాలయంలో సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లతో ఎస్ఎస్ఎఫ్పీ కార్య నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి, ప్రతి 15 రోజులకోసారి సరైన పద్ధతిలో బరువులు, ఎత్తు కొలతలను తీసి ఆన్‌లైన్‌లో సరైన విధంగా నమోదు చేయాలన్నారు. సీడీపీఓలు రమాదేవి, మహేశ్ తదితరులున్నారు.
MHBD: బీఆర్ఎస్ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రశ్నించే వారిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే ఉంటామన్నారు.
MHBD: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో షెడ్యూల్డ్ తెగల కోసం రాజ్యాంగపరమైన రక్షణలు, సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు, మహబూబాబాద్ జిల్లా వాసి జాటోత్ హుస్సేన్ నాయక్ సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అంకితభావంతో పని చేయాలని హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.