India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రయోగ పరీక్షల్లో గైర్హాజరైన విద్యార్థులకు మరొక అవకాశంగా ప్రత్యేక బ్యాచ్ ప్రయోగ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. మూడు విడుతల్లో నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో పలువురు విద్యార్థులు అనారోగ్య, తదితర కారణాల వల్ల గైర్హాజరయ్యారని, వారందరికీ ప్రత్యేక బ్యాచ్‌గా స్థానిక ఏవీవీ జూ.కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిమ్ ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.
కులగణన సర్వేలో వివిధ కారణాల ద్వారా ఎవరైతే వివరాలు ఇవ్వలేదో వారికోసం మరోసారి అవకాశం కల్పించామని అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రజా పాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆదివారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రీ సర్వేలో నమోదు వివరాలను, రిజిస్టర్లు పరిశీలించారు. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 040- 211111111కు ఫోన్ చేసి నమోదు చేసుకోవచ్చన్నారు.
రైలు కింద పడి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మారంలో ఓ ప్రైవేట్ షాపులో పని చేసే గోపాల రమ్య(35) 3రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేక చింతలపల్లి రైల్వే స్టేషన్ మధ్య ధర్మారం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని జీఆర్పీ పోలీసులు తెలిపారు.
వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వరంగల్ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉండగా, వరంగల్, ఖిలా వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. 694 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 130 ఎంపీటీసీ స్థానాలకు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో మొత్తం 3,85,162 మంది ఓటర్లు ఉన్నారు.
మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి వరంగల్ రీజియన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వరంగల్-1 డిపో నుంచి 21 బస్సులు, హనుమకొండ 27, మహబూబాబాద్ 30, నర్సంపేట 30, పరకాల 24 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నర్సంపేట పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. సర్వాపురానికి చెందిన గుండేటి రామస్వామి (65) రాత్రి నర్సంపేట-మహబూబాబాద్ 365వ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.