India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర రెండు రోజులతో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలు క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా నేడు రూ.7,800 అయిందని మార్కెట్ అధికారులు తెలిపారు. ధరలు పెరగడం రైతులకు కొంత ఊరట లభించినట్టయింది. మరింత ధరలు పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ 16 నుంచి 20 వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు చెప్పారు.
వరంగల్ రీజియన్ పరిధిలోని ములుగు, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 12న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు మడికొండలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు హాజరు కావాలన్నారు.
ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు వరంగల్, హనుమకొండ డీఐఈవోలు ఎ.గోపాల్, డా.సుమన్ శ్రీధర్ తెలిపారు. బోర్డు నిర్దేశించిన ప్రవేశాల గడువు ఈ నెల 7తో ముగియగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 15 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాకతీయ యూనివర్సిటీ స్టేషన్ పరిధి గోపాల్‌పూర్ శివసాయి కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వేలేరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ శివసాయి కాలనీలో ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఏడాదిగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, కేయూ పోలీసులతో కలిసి ఆ గృహంపై దాడి చేసి ఆమెను అరెస్టు చేశారు.
ప్రభుత్వం HYD రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
కాలం చెల్లిన వాహనాలను నడిపితే సంబంధిత వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటామని జనగామ ఏసీపీ పార్థసారధి వాహనదారులను హెచ్చరించారు. మంగళవారం రాత్రి నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డెన్ చర్చిలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, సహజ వనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారని, పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక, ఈ పోరాటానికి ప్రపంచ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉందని కేటీఆర్ ఓ ప్రత్యేక ఫొటోను ట్వీట్ చేశారు.
వంగరలోని ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.