India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మేడారం జాతరకు శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదన సిద్ధం చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీతతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మేడారం జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గద్దెల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు.
వరంగల్ నగరంలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. మంగళవారం నిమజ్జనానికి సంబంధించిన చెరువులను, పరిసర ప్రాంతాలను సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నందిరాం నాయక్, CI గోపి, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిస్తున్నాయి. మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి ధర నిన్నటి లాగే రూ.7,700 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర మరింత పెరిగేలా వ్యాపారులు చొరవ తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పైడిపల్లికి చెందిన స్వాతికి అదే గ్రామానికి చెందిన నిరంజన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత నుంచి ఆమె భర్త, అత్త కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినా వేధించడం మానకపోయేసరికి ఈ నెల 5న గడ్డి మందు తాగింది. MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అర్చకులు, ఉద్యోగుల తీరు విమర్శలకు తావిస్తోంది. అమ్మవారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన పలు వస్తువులను కొందరు అర్చకులు, అధికారులు ఫలహారంగా పంచుతున్నట్లు సమాచారం. అమ్మవారికి భక్తులు చీర, సారె, పూజా వస్తువులు, పూలు, పండ్లు ఇతరత్రా వస్తువులు భక్తితో సమర్పిస్తారు. ఇవి పక్కదారి పట్టడం ఆందోళన కలిగిస్తోంది.
> WGL: ఏడుగురు పేకాటరాయుళ్ళ అరెస్ట్.. > HNK: గుండెపోటుతో జర్నలిస్టు మృతి.. > BHPL: బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి.. > MLG: విష జ్వరం.. అనాధలుగా మారిన పిల్లలు.. > HNK: నలుగురు నకిలీ రిపోర్టర్లు అరెస్ట్.. > MHBD: కేసముద్రం మండలాల్లో గుప్పుమంటున్న గుడుంబా! > MLG: దొంగను పట్టించిన సీసీ కెమెరాలు..
గణేష్ నవరాత్రులను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏసిపి కిరణ్ కుమార్ సోమవారం పూజలు నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్ రవి, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహ రాములు తదితరులు ఉన్నారు.
ఆగ్రాలో జరిగిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో కేంద్ర మంత్రులు డాక్టర్ వీరేంద్ర కుమార్, రాందాస్ అథవాలేతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సీతక్క మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న మరోసారి రికార్డు ధర పలికింది. గత వారం మార్కెట్లో క్వింటా మొక్కజొన్న ధర రూ.3,015 పలకగా.. నేడు అదే ధర పలికి రికార్డును కొనసాగించింది. మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
TGNPDCL సంస్థలోని ఉద్యోగులు భారీ వర్షాలను వరదలను సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎవరైనా లంచం అడిగితే 92810 33233 నంబరుకు, విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.