India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు స్థానిక నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డాక్టర్ వి పూర్ణచందర్ శనివారం తెలిపారు. 1, 3, 5 సెమిస్టర్ల పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 పొడిగించామన్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు మార్చి 1 నుంచి 6 వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు 7 నుంచి 13 వరకు ఉంటాయన్నారు.
కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.
వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్‌నరగ్‌కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఎస్ఐలు సారంగపాణి, రవీందర్, రమేశ్, గోవర్ధన్‌లను వరంగల్ సీపీ అంబర్ అంబర్ కిషోర్ ఝా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. తమ సేవలు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా తమ గౌరవం తగ్గదని, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలని వ్యాయామం కొరకు సమయం కేటాయించాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పల్లికాయ తరలివచ్చాయి. ఈ క్రమంలో క్వింటా సూక పల్లికాయ రూ.6,200 ధర పలకగా.. పచ్చి పల్లికాయ రూ.5,510, ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా రేపు, ఎల్లుండి మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు రానున్న నేపథ్యంలో ఈరోజు మార్కెట్‌కు పలురకాల సరుకులను రైతులు తీసుకొని వచ్చారు.
ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం శివారు బేగావతు తండాలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరన్న ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.9 లక్షల నగదు దోచుకుపోయారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సీహెచ్ నగేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 3,474 మంది విద్యార్థులను గాను రూ.19,80,180 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.