Warangal

News January 31, 2025

హైవే ఏర్పాటుకు రైతులు సహకరించాలి: WGL కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై రైతుల ఎలాంటి అపోహలు చెందవద్దని, మెరుగైన పరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాట్ల కోసం భూ సేకరణకు పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ, సంగెం మండలం చింతలపల్లి మండలాలకు చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News January 30, 2025

ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

image

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.

News January 30, 2025

వరంగల్ మార్కెట్లో అరుదైన మిర్చి ఉత్పత్తులు రాక

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12వేలు, డబ్బి బ్యాగడి మిర్చి రూ.18,500, నం.5 మిర్చి ధర రూ.13,500 పలికాయి. అలాగే 2043 మిర్చి రూ.13వేలు, 5531 మిర్చి రూ.11,200, 2043 మిర్చి రూ.14వేలు, 273 రకం మిర్చి రూ.12వేలు, 334 మిర్చి రూ.11,500, ఎల్లో మిర్చి రూ.16,500 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

News January 30, 2025

నెక్కొండ: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు!

image

కారు ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెక్కొండ నుంచి కేసముద్రం వెళ్లే రోడ్డులో అప్పలరావుపేట గ్రామ శివారు మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 30, 2025

HNK: గోపాలపూర్‌ ఘటన.. ఇరు వర్గాల ఫిర్యాదు

image

ఇంటర్ చదువుతున్న బాలిక ఆత్మహత్య, యువకుడి గొంతు కోసిన ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. HNK గోపాలపూర్‌లో 2 రోజుల క్రితం తన ఇంట్లో కూతురితో ఓ యువకుడు సన్నిహితంగా ఉండటాన్ని చూసి తండ్రి సదరు యువకుడిపై దాడి చేయగా.. బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. బాలిక తండ్రి, మేనమామపై హత్యాయత్నం, అట్రాసిటీ.. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News January 30, 2025

వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

image

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్‌కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్‌పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం.

News January 30, 2025

వరంగల్: పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ టెస్ట్

image

పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 4 నుంచి స్పెషల్ టెస్ట్ నిర్వహిస్తున్నామని వరంగల్ డీఈవో మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 తర్వాత నుంచి సిలబస్‌ను స్పెషల్ టెస్ట్‌కు విద్యార్థులు సన్నద్ధం కావాలని చెప్పారు.

News January 30, 2025

నేడు ఎంజీఎంలో గుండె వైద్య శిబిరం

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు కోరారు.

News January 30, 2025

వరంగల్: ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన వికాస్ రాజ్ 

image

వరంగల్ జిల్లాలో నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వరంగల్‌కు వచ్చారు. జిల్లా కలెక్టర్ సత్యశారద దేవితో కలిసి బుధవారం ఆసుపత్రి నిర్మాణ పనులను వికాస్ రాజ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులున్నారు.

News January 30, 2025

వరంగల్:భవన నిర్మాణాన్ని ప్రారంభానికి సిద్ధం చేయండి: కలెక్టర్ 

image

ప్రభుత్వ ఉద్యోగినుల వసతిగృహ భవనాన్ని త్వరితంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, డాక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం వరంగల్‌లోని దేశాయిపేట శివాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఉద్యోగినుల గృహ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.