India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు గురువారం వరంగల్ జిల్లాకు రానున్నట్లు జిల్లా BRS పార్టీ నాయకులు తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆయన సంగెం మండలంలో జరిగే బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సమావేశంలో పాల్గొంటారన్నారు. అనంతరం 2 గంటలకు కాజీపేటకు వెళ్లి బాలవికాస్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఆయన పర్యటన విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా సమస్యకు పరిష్కారం చూపలేదని వీఆర్ఏ వారసుల సంఘం రాష్ట్ర నాయకుడు, జేఏసీ జయశంకర్ జిల్లా ఛైర్మన్ చిన్నపురి హరీశ్ అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 18 నెలలుగా ముఖ్యమంత్రి, మంత్రుల ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా లాభం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు.
GWMC కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో BRSకి చెందిన కార్పొరేటర్లతో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆయా డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సిల్‌లో చర్చించాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వరంగల్ జిల్లాలో రైతు భరోసా పథకం అమలు కోసం భూముల సర్వేను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పథకంలో సాగు చేసే భూములను, సాగుకు సంబంధం లేని భూములను సర్వేలో అధికారులు గుర్తించారు. ఇందులో జిల్లాలో 2.67 లక్షల ఎకరాలను సాగులో ఉన్నవిగా, 2,350 ఎకరాలను సాగులో లేనివిగా నిర్ధారణకు వచ్చారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు.
ఈ నెల 30న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీహెచ్ఎంఓ సాంబశివరావు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2D ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వరంగల్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఓ ఫార్మా కంపెనీ 100 ఉద్యోగాలకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పన జిల్లా అధికారి సీహెచ్ ఉమారాణి తెలిపారు. రిటైల్ ట్రైనీ అసోసియేట్, ఫార్మసీ అసిస్టెంట్, ట్రైనీ ఫార్మాసిస్ట్ ,ఫార్మాసిస్ట్ విభాగాల్లో 100 ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, డీ ఫార్మా, బీ ఫార్మా, ఎం ఫార్మా అభ్యర్థులు అర్హులన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వివిధ రకాల ఉత్పత్తులు తరలివచ్చాయి. అకిరా బ్యాగడి మిర్చి రూ.12 వేలు పలకగా 5531 మిర్చి రూ.12 వేలు, 3341 రకం మిర్చి రూ.11,500 పలికింది. నం. 5 మిర్చి రూ.13,500, సూక పల్లికాయ రూ.6,000, పచ్చి పల్లికాయ రూ.5,100, మక్కలు (బిల్టీ) రూ.2,540 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
ఆరోగ్య సమస్యతో హాస్పిటల్‌కి వెళ్తే హాస్పిటల్‌లోనే కుప్పకూలిన ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆరోగ్య సమస్యతో శాయంపేటకు చెందిన పిక్కల శ్రీనివాస్ (42) మంగళవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ తీసుకున్నారు. ఆ తర్వాత ఓపీ చూపించుకోవడానికి లైన్‌లో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు పరిశీలించి వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు పరీక్షించి మరణించాడని ధ్రువీకరించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు బంద్ ఉండనున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. బుధవారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌కి సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి రేపు సరుకు తీసుకొని రావద్దని, తిరిగి గురువారం మార్కెట్ ప్రారంభం అవుతుందని వివరించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత మూడు రోజులుగా దారుణంగా పడిపోతున్నాయి. గతవారం క్వింటా పత్తి రూ.7,200కి పైగా పలకగా, నిన్న (సోమవారం) రూ.7,020కి పతనమైంది. ఈరోజు మరింత తగ్గి రూ.6,940 కి పడిపోయింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.100 చొప్పున ధర తగ్గుతుండటంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.