India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్ ట్రాక్ ఘటనతో సోమవారం రెండో రోజు కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు.. 5న డోర్నకల్-విజయవాడ(07755), ప్యాసింజర్, డోర్నకల్- కాజీపేట(07754) ప్యాసింజర్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్, నాగపూర్, నడికుడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.
2024-25 ఏడాదికి వరంగల్ జిల్లాలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన, అల్ప సంఖ్యాక, దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31 లోగా ‘ఈపాస్ వెబ్ సైట్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వరదలొస్తేనే కాని అధికారులకు చెరువులు, నాలాలు గుర్తుకురావని WGL నగర ప్రజలు మండిపడుతున్నారు. ఏడాది నుంచి భద్రకాళి చెరువు కట్టను ఎవరూ పట్టించుకోలేదని, ప్రస్తుతం చెరువు నిండుకుండలా మారిందన్నారు. పోతననగర్ వైపు చెరువు కట్ట బలహీనంగా మారడంతో దిగువన ఉన్న కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం కలెక్టర్ ప్రావీణ్య చెరువు కట్టను పరిశీలించి అధికారులపై మండిపడటంతో ఇసుక బస్తాలను నింపుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నీటి మునిగాయి. దీంతో పంటకు తెగులు సోకే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డా.ఉమారెడ్డి సూచించారు. పత్తిలో నీటిని తీసివేసి, ఎకరాకు 30కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వేయాలని.. మిరపకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా. తెగులు సోకిన మొక్కల మొదళ్లకు పోయాలని సూచించారు.
వరంగల్ నగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి చెరువులో లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్(లైడర్) సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. నగరంలోని 75 చెరువుల్లో రూ.25 లక్షల వ్యయంతో డ్రోన్ సర్వే కోసం టెండర్లు పిలిచారు. ఈ సర్వే ద్వారా చెరువు విస్తీర్ణం, పూర్తి నీటి నిల్వ ఎత్తు(FTL)లో ఆక్రమణలు గుర్తిస్తారు. సర్వేను 100 రోజుల్లో పూర్తి చేస్తామని DEE హర్షవర్ధన్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. నెల్లికుదురు మండలం రావిలాల, మర్రిపెడ మండలం పురుషోత్తమగుడం గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించరున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి పోలీస్ శాఖతోపాటు వివిధ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హనుమకొండ జిల్లాకు విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య దంపతులు కలిసి సన్మానించారు. అనంతరం వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన పలు అంశాలపై స్పీకర్‌తో ఎంపీ చర్చించారు. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఎంపీకి స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హనుమకొండ 48వ డివిజన్ పరిధిలోని హాజరత్ సయ్యద్ షా ఆఫ్జాల్ బియబాని దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట MLA నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ, పీఠాధిపతి ఖుస్రో పాషా, మత పెద్దలు తదితరులున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎంపీ బలరాం నాయక్ పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలతో ఎంపీ మాట్లాడి ప్రజలకు ధైర్యం చెప్పి నిత్యం అండగా ఉంటామని చెప్పారు. వరదల వల్ల తెగిపోయిన రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఎంపీ కోరారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
> దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
> మరిపెడ: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయి అశ్విని అనే యువతి మృతి
> కేసముద్రం: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> మరిపెడ: కూలిన జాతీయ రహదారి.. రాకపోకలు బంద్
> భూపాలపల్లి: సింగరేణికి రూ.35 లక్షల వరకు నష్టం
> తాడ్వాయి: పశువుల మేత కోసం వెళ్లి ఒకరి మృతి
> WGL: పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు
> MHBD: జిల్లాలో తెగిన పలు చెరువు కట్టలు, రోడ్లు
Sorry, no posts matched your criteria.