India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలన్నింటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హన్మకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వ పథకాల కోసం నిర్వహిస్తున్న సర్వేను నేడు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డులకు కోసం 1.57లక్షల దరఖాస్తులు గతంలోనే వచ్చాయి. ఆత్మీయ భరోసాకు 18 లక్షల EGS కార్డులు ఉన్నాయి.రైతు భరోసాలో 8.77 లక్షలు గత సీజన్‌లో లబ్ధి పొందారు. వీటిపై ఈ నెల 20 వరకు దరఖాస్తులను పరిశీలించి, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులు బ్యాలెట్ పేపర్ల ముద్రణపై కసరత్తు చేస్తున్నారు. ఎప్పటి లాగే సర్పంచులకు గులాబీ బ్యాలెట్, వార్డ్ మెంబర్లకు తెలుపు బ్యాలెట్ ఉపయోగించనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,806 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
పోటీ పరీక్షలు ప్రిపేరయ్యే మైనారిటీ అభ్యర్థులకు బేసిక్ ఫౌండేషన్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్ తెలిపారు. రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు HYDలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు సరైన ధ్రువపత్రాలతో వచ్చే నెల 15 వరకు కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాలు తరలివచ్చాయి. పచ్చి పల్లికాయ క్వింటా ధర రూ.4300 పలకగా.. సూక పల్లికాయ ధర రూ.6210 పలికింది. అలాగే కందులు క్వింటాకు రూ.7003, బబ్బెర్లు రూ.7100, నల్లనువ్వులు రూ.11,500 పలికినట్లు రైతన్నలు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరలు, ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొత్తకొండ, ఐనవోలు, ఊరుగొండ ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరగనన్నాయి. అంతేకాకుండా వచ్చే నెల 12 నుంచి మేడారం మినీ జాతర జరగనుంది. ఈ సందర్భంగా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి దర్గా ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈనెల 16న గంధం, 17న దీపారాధన, 18న ఖత్ మే ఖురాన్ ఉత్సవాలు జరగనున్నాయి. మత సామరస్యానికి ప్రతీకగా అన్నారం దర్గా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్సవాలకు విచ్చేస్తుంటారు. మీరూ ఉర్సు ఉత్సవాలకు వెళ్తే కామెంట్ చేయండి.
హనుమకొండ జిల్లాలో జరుగుతున్న రెండు (ఐనవోలు, కొత్తకొండ) జాతరల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు DMHO డా.అల్లం అప్పయ్య తెలిపారు. ఐనవోలులో 50 మంది, కొత్తకొండలో 40 మంది వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, స్టాఫ్ నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు ANMలు, MNOలు ఆశాలు 3 షిఫ్టులలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొత్తకొండ జాతరలో 1,071, ఐనవోలులో 3,728 మందికి సేవలందించామన్నారు.
ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉ. 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.