Warangal

News February 3, 2025

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కు మాతృవియోగం

image

వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ తల్లి వెంకటమ్మ మృతి చెందారు. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామంలో మృతి చెందగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె మృతి పట్ల పలు పార్టీలకు చెందిన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

News February 3, 2025

ఉప్పరపల్లి: గీత కార్మికుడికి తీవ్రగాయాలు

image

చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మండ నరేందర్ గౌడ్ తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. తలకు, నడుముకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 

News February 3, 2025

వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. తరలివచ్చిన పత్తి 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం తాము ఊహించిన విధంగా రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. 15 రోజుల క్రితం రూ.7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,000 పలికినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు.

News February 3, 2025

బయ్యారం: చిన్నారిపై వృద్ధుడి అసభ్య ప్రవర్తన

image

చిన్నారిపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తన ఘటన బయ్యారం(M)లో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన వృద్ధుడు చెన్నయ్య ఇంటి సమీపంలోని చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు మందలించారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉండటంతో మద్యం మత్తులో వికృతచేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.

News February 3, 2025

వరంగల్: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సుబేదారి PS పరిధిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం(M) ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గొడవపడి HNKలోని స్నేహితురాలి వద్ద ఉంటోంది. బాలసముద్రంలో ఎగ్జిబిషన్‌‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బస్టాండ్‌లో వదిలేశాడు. స్థానికులు యువతిని PSకి తరలించగా ఆటోడ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలిపింది.

News February 3, 2025

నెక్కొండ: మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి

image

నెక్కొండ మండల కేంద్రంలో గొడవ జరుగుతుండగా అడ్డుకోబోయిన పోలీసులపై యువకులు దాడి చేశారు. మండల కేంద్రానికి చెందిన యువకులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య ఆదివారం గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వయిరీ చేస్తుండగా ఇద్దరు యువకులు పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 3, 2025

WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!

image

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News February 2, 2025

బీసీలు అంతా ఒక్క తాటిపైకి రావాలి: MLC సారయ్య

image

బీసీలు అంతా ఒక్కతాటి పైకి వచ్చి, బీసీ రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం జరుగుతున్న ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీలు హాజరయ్యారు.

News February 2, 2025

ఇంటర్ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యే ప్రయోగ పరీక్షల వివరాలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 36 జనరల్ పరీక్షా కేంద్రాలు, 7 ఒకేషనల్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

News February 2, 2025

నెక్కొండ: పారా అథ్లెటిక్స్‌లో దేవాకు బంగారు పతకాలు

image

నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన నునావత్ దేవా రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 17 -20వ తేదీ వరకు తమిళనాడులోని చెన్నైలో జరగబోయే 23వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీలకు దేవా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారా అథ్లెటిక్స్ అధ్యక్షుడు శేఖర్ అభినందించారు.