India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారం, గొల్లకురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రెడీ అయింది. గొల్లకురుమల జాతరగా పిలిచే ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కొనసాగుతాయి. చుట్టుపక్కల జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
> HNK: విద్యుత్ షాక్ తో ఒకరి మృతి..> MLG: మూడు పల్టీలు కొట్టిన కారు..> JN: పాలకుర్తిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందికి దూసుకెళ్లిన బైకు > MHBD: బామ్మర్దిపై కత్తితో బావ దాడి> WGL: ఈర్యా తండా సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు> JN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి> WGL: రోడ్ సేఫ్టీపై అవగాహన..
గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయం కోటగుళ్ళలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నందీశ్వరుని పూజతో మొదలుకొని స్వామివారికి రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం జర్నీ తండా వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. డీసీఎం, తుఫాన్ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మృతులు సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన పేరాల జ్యోతి, పేరాల వెంకన్నగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వైకుంఠ ఏకాదశి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏకాదశి రోజున విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల గట్టి నమ్మకం. కాగా మహావిష్ణువును దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి బయలుదేరే రోజే వైకుంఠ ఏకాదశిగా చెప్పుకుంటారు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని హౌజ్‌బుజుర్గ్ గ్రామానికి చెందిన కమలాకర్(37) పరకాల డివిజన్‌లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా, ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. అనంతరం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సహకార సంఘాల బలోపేతం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని, ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులతో కలిసి విద్యాశాఖ, రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి సబ్జెక్టులో అర్థమయ్యే రీతిలో అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు.
సుధీర్ఘ కాలం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డ్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హోం గార్డ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గురువారం క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్‌లో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని హోం గార్డ్‌కు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్ కుమార్, ఏసీపీ నాగయ్య, ఆర్.ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.