India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి దేవస్థానంలో నేడు ధనుర్మాసం గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
ఆస్తి కోసం కొడుకులతో కలిసి భర్తపై భార్య దాడి చేసిన ఘటన మొగుపల్లి(M) బంగ్లాపల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ 6 ఎకరాల భూమిని వారి పేరు మీద రాయాలంటూ భార్య, ముగ్గురు కుమారులు తరచూ ఒత్తిడికి గురి చేశారు. ఈ విషయంపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం భార్య, ముగ్గురు కొడుకులు కత్తితో శ్రీనివాస్‌పై దాడి చేయగా ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది.
సమాజంలో మహిళా ఉద్యోగులు ఎంతో కీలకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం జనగామ కలెక్టరేట్లో మహిళా శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వేధింపుల చట్టం, లైంగిక చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారులు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్థులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు నిన్న రూ.6,500 ధర పలకగా.. నేడు రూ.6,610కి పెరిగింది. అలాగే పచ్చి పల్లికాయకు మంగళవారం రూ.4,860 ధర రాగా.. నేడు రూ.4,750కి పడిపోయింది. అలాగే క్వింటా పసుపుకి రూ.11,609 ధర వచ్చిందని అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర క్రమంగా, స్వల్పంగా తగ్గుతూ వస్తున్నది. మక్కలు(బిల్టీ) క్వింటాకు గతవారం రూ. 2570 పలకగా.. సోమవారం, మంగళవారంలు రూ.2,565 ధర పలికాయి. ఈరోజు మరింత తగ్గి రూ.2560 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చికి నిన్న రూ.14,500 ధర రాగా నేడు రూ.14,900 పలికింది. కొత్త 341 రకం మిర్చికి నిన్నటి లాగే రూ. 14 వేలు పలికింది.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల అభయారణ్యంలో ఈ నెల 12న బర్డ్ వాక్ నిర్వహించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన 50కి పైగా రకాల పక్షులు ఏటా చలికాలంలో పాకాల అభయరణ్యానికి అతిథులుగా వస్తుంటాయి. వేసవి ముందు తిరిగి వాటి ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాయి. వాటిని వీక్షించేందుకు బర్డ్ వాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10 వరకు పేర్లను నమోదు చేసుకోవాలని వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగనున్న నేపథ్యంలో ZPTC, MPTC ఎన్నికలపై అధికారులు ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్స్ ఆయా జిల్లాలకు చేరినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో 79 ZPTC, 1075 MPTC స్థానాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా ఆశావహులు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనాపురానికి చెందిన సతీశ్ అనే వ్యక్తి బాలికను అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఓ బాలికను నమ్మించి బైకుపై తీసుకెళ్లి ఎంచగూడంలో అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో వారు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.