India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వైపు చైనా మాంజా.. మరోవైపు చైనా వైరస్‌తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల <<15024024>>జనగామలో చైనా మాంజా<<>>తో నలుగురు గాయపడ్డారు. దీంతో రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు భయపడుతున్నారు. అంతేగాక ఇప్పటికే చైనా వైరస్ hMPV ప్రభావంతో జిల్లాలో పలువురు మాస్కులు ధరిస్తున్నారు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు.
కాకతీయుల కాలం నాటి ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాశస్త్యం కలిగిందని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ రవీందర్ రావు అన్నారు. మంగళవారం ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై అన్ని శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వెంకటాపురం సమీప అడవుల్లో నెల రోజుల క్రితం పెద్దపులి సంచరించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సుమారు నెలరోజుల పాటు వివిధ జిల్లాల అటవీ ప్రాంతంలో పులి సంచారం కొనసాగించింది. జనవరి 1న ములుగు జిల్లాలోని లింగాల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాకు పులి సంచారం చిక్కింది. మళ్లీ అవే ట్రాప్ కెమెరాలకు మరోసారి పెద్దపులి సంచారం కనిపించింది. దీంతో జిల్లాలోనే పులి ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,43,540 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే మగవారితో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. HNK(D) 5,08,618, WGL(D) 7,73,453, జనగామ(D) 7,62,106, MHBD(D) 4,85,692, BHPL(D) 2,78,185, ములుగు(D) 2,35,486 మంది ఓటర్లు ఉన్నారు. WGL జిల్లాలో ఎక్కువ, ములుగులో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.
మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులను, జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని అధికారులు సోమవారం పరిశీలించారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆనందం, కీర్తన్, సర్వేయర్ రజిత, ఏఈఈ రాజ్ కుమార్ తదితరులున్నారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో సోమవారం సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పలువురు భక్తులు సిద్దేశ్వరుడిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు(బిల్టీ) క్వింటాకు సోమవారం రూ.2,565 ధర పెరిగింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర గతవారంలాగే రూ.15,500, కొత్త 341 రకం మిర్చికి రూ.15,011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులకు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికారిక పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన మంత్రి కొండా సురేఖకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రితో మేయర్, ఎంపీ కడియం కావ్య చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
హనుమకొండ న్యూ బస్ స్టేషన్లో నేడు నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభించనున్నారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, రెండవ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా జనగామ పట్టణంలో మాంజా కోసుకుని నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.