Warangal

News July 19, 2024

అధికారులు నిబద్ధతతో పనిచేయాలి: జనగామ కలెక్టర్

image

అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. నేడు జిల్లా కలెక్టర్ 6 మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్, 2018పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి అధికారి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

News July 19, 2024

వృద్ధురాలితో ముచ్చటించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

image

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పర్యటించారు. పర్యటనలో భాగంగా వృద్ధురాలితో మాట్లాడి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా రంజక పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.

News July 19, 2024

ములుగు: గోదావరిలో ఒకరు గల్లంతు

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోదావరి నదిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికుల ప్రకారం.. వెంకటాపురం పరిధిలోని అలుబాక గ్రామ సమీపంలోని గోదావరిలో శుక్రవారం మధ్యాహ్నం బానారి రాజు( 45) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గల్లంతయిన రాజు కోసం నాటు పడవ ద్వారా గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 19, 2024

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం తేజ ఏసీ మిర్చి ధర స్వల్పంగా పెరగగా.. మిగతా ధరలు తగ్గాయి. తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.17 వేలు పలకగా.. నేడు రూ.17,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.16 వేలు పలకగా.. నేడు రూ.15,200 ధర వచ్చింది. వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ. 14 వేల ధర రాగా.. నేడు రూ.13,500 వచ్చింది.

News July 19, 2024

వరంగల్: మక్కల ధరలకు బ్రేక్!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా రికార్డులు సృష్టిస్తున్న మొక్కజొన్న ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన మక్కల ధర ఈరోజు తగ్గింది. గురువారం రూ.2,780 పలికిన ధర.. ఈరోజు రూ.2,750 కి చేరింది. నిన్నటికి, నేటికీ స్వల్ప తేడా ఉన్నప్పటికీ ధరలు భారీగా పలుకుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 19, 2024

సమాచారం ఇస్తే నగదు బహుమతి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా లేదా తాగుతున్నట్లు సమాచారం ఇస్తే నగదు బహుమతి అందజేస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. సమాచారం తెలియజేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. పెద్ద మొత్తంలో గంజాయి సమాచారం ఇచ్చిన వారికి భారీగా నగదు బహుమతి అందజేస్తామన్నారు. 87125 84473 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News July 19, 2024

వరంగల్ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7,245

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7,245 పలికింది. గత వారం రూ.7,400 పలికిన పత్తి ధర.. ఈ వారం క్రమంగా తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వారంలో పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,310, మంగళవారం రూ.7,350, బుధవారం మార్కెట్ బంద్, గురువారం రూ.7,235కి పలికాయి.

News July 19, 2024

వెంకటాపురం-వాజేడు: ఆకట్టుకుంటున్న గడి చెరువు జలపాతం

image

ములుగు జిల్లా వెంకటాపురం-వాజేడు మండలాల సరిహద్దు అభయారణ్యంలోని మహితాపురం, బొల్లారం గ్రామాల సమీపంలో ఉన్న గడి చెరువు జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎత్తయిన గుట్టలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. గుట్టలపై నుంచి జాలువారుతున్న జలధారలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. మరి మీరు ఈ జలపాతం చూశారో కామెంట్ చేయండి.

News July 19, 2024

వరంగల్: నేడు భారీ వర్షం

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. MHBD, MLG జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, HNK, WGL, BHPL ఆరెంజ్‌, జనగామకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ వరంగల్‌లో వరద ముంపు, వర్షపు నీళ్ల ఆగడం తదితర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 1980, సెల్‌ నంబరు 97019 99645 సంప్రదించాలని కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ప్రకటనలో కోరారు.

News July 18, 2024

ములుగు: రిజిస్టర్ కార్యాలయంలో మతాంతర వివాహం

image

ములుగు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన కుమారుడు భరత్, తస్లీమ్‌లకు ఆదర్శ వివాహాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ బిక్షపతి హాజరై మాట్లాడుతూ.. మతాంతర వివాహం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. నేటి సమాజంలో వరకట్న వేధింపులు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆదర్శ వివాహం చేసుకోవడం హర్షనీయమన్నారు.