India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి నుంచి ప్రారంభమైన గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా నగరంలోని డివిజన్ల పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభలకు వరంగల్ పోలీస్ కమిషనర్ హాజరువుతున్నారు. ఇందులో భాగంగా 22వ డివిజన్లో నిర్వహించిన గ్రామ సభకు పోలీస్ కమిషనర్ పాల్గొని పోలీస్ బందోబస్తుతో పాటు సభ ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, వరంగల్ ఏసీపీ నందిరాం మట్టేవాడ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.
ఇటీవల అర్జున అవార్డు అందుకున్న ఓరుగల్లు బిడ్డ దీప్తి మరో అవార్డుకు ఎంపికైంది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డుకు దీప్తి ఎంపికైనట్లు సోమవారం ప్రకటించారు. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఈనెల 26న ప్రదానం చేయనున్నారు. అవార్డులో భాగంగా రూ.2లక్షల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. కాగా, దీప్తి పర్వతగిరి మండలం కల్లెడవాసి.
ములుగు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకై ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి చిరుధాన్యాలు సోమవారం తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.6310 ధర పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4450 పలికింది. అలాగే కందులు రూ.7,100 పలికినట్లు వ్యాపారస్తులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులు తేమ లేని నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీ నిర్వహణకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వంట సామగ్రిని భద్రపరిచిన స్టోర్ రూమును పరిశీలించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా కొత్త తేజ మిర్చి ధర రూ.14,700 ధర పలకగా.. 341 రకం మిర్చికి రూ.15,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్ మిర్చికి రూ.12,700 ధర పలికిందని రైతులు చెబుతున్నారు.
శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈరోజు తెల్లవారుజామున నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌తో పాటు ఏటీయం సెంటర్లను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్, ఏటీయం సెంటర్లలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రాత్రి సమయాల్లో పోలీస్ సిబ్బంది పనితీరును గమనించేందుకు సీపీ హన్మకొండ పోలీస్ స్టేషన్ సైతం తనీఖీ చేశారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు.
రైతుభరోసా, నూతన రేషన్ కార్డులు విచారణ ప్రక్రియలో జిల్లా, మండలస్థాయి అధికారులు భాగస్వాములైనందున ఈనెల 20న (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు ప్రజావాణి తాత్కాలిక రద్దుపై ఆదివారం ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి విచారణ, 21వ తేదీ నుంచి జరుగనున్న గ్రామసభల నిర్వహిస్తామన్నారు.
రేగొండ మండలం లింగాల గ్రామం, గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేటలో జరుగుతున్న పథకాల సర్వే ప్రక్రియను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పకడ్బందీ, పారదర్శకంగా జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. రైతులు, పథకాల లబ్ధిదారులు ఈ ప్రక్రియ ద్వారా తమకు అందే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.