India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలిసి న్యూఇయర్ విషెస్ తెలిపారు. అనంతరం పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్ణికరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ పతకాలకు ఎంపిక చేసింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న పీవీఎస్.కుమార్ గుప్తాకు మహోన్నత సేవా పతకానికి ఎంపిక కాగా.. ఆర్.ఎస్.ఐలు క్రిస్తా చారి, యండి నయీమ్, ఎ.ఆర్.ఎస్.ఐ సదానందం, హెడ్ కానిస్టేబుళ్లు మాధవ రెడ్డి, ఆనందం, కానిస్టేబుల్ యాకయ్య సేవా పతకానికి ఎంపికయ్యారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో మన జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు (బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి గురువారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందన్నారు. రైతులు విషయాన్ని గమనించి నేడు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు.
కొమురవెల్లి మల్లన్న కళ్యాణం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.16.50 లక్షల మేరకు బుకింగ్ ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తలనీలాల సమర్పణ, ఆర్జిత సేవలు, పట్నాలు, బోనాలు, ప్రత్యేక దర్శనాలు, వసతి గదుల అద్దె, ప్రసాద విక్రయాలు ఇతర ద్వారా ఆదివారం రూ. 13.40 లక్షలు, సోమవారం లక్ష రూపాయల బుకింగ్ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలను సంతోషకర వాతావరణంలో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకలు ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రతి ప్రాంతంలో పోలీస్ గస్తీ ఉంటుందని, వాహనదారులు మద్యం సేవించి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని జరిమానతో పాటు జైలుకు పంపిస్తామని CP హెచ్చరించారు.
ఈ ఏడాది నేటితో పూర్తవుతోంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. చేసిన తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వాటన్నింటిని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేసుంటారు. మరీ ఈ ఏడాది మీరేం సాధించారు? ఏం కోల్పోయారు? ఏం నేర్చుకున్నారు? మీ మధుర జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి.
కొత్త సంవత్సరం వేడుకలకు వరంగల్ సిద్ధమయింది. నేటితో 2024 సంవత్సరం ముగియనుండటంతో ఇప్పటికే నగరంతో పాటు.. గ్రామాల్లో వేడుకలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో నగరం మెరిసిపోతుండగా.. ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండగ వాతావారణం కనిపిస్తోంది. మరి ఈరోజు న్యూ ఇయర్ వేడుకలు మీరెలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ తుది ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారు. కాగా ఉమ్మడి జిల్లాల్లో 200పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఇందులో 14,940 పురుషులు, 9,965మంది మహిళా ఉపాధ్యాయ ఓటర్ లు ఉన్నారు. మొత్తంగా 24,905 ఓటర్ లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 2,351మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
మార్గశిర సోమావతి అమావాస్య సందర్భంగా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వరస్వామివారికి మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నపూజ, విశేష పూల అలంకరణ కార్యక్రమాన్ని ఉపప్రధాన అర్చకులు డీవీఆర్ శర్మ, ముఖ్య అర్చకులు అనిల్ శర్మ, నాగరాజు శర్మ ఆధ్వర్యంలో సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ఈఓ మోహన్ బాబు, పర్యవేక్షకుడు వెంకటయ్య, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.