Warangal

News July 16, 2024

రాజన్న సన్నిధిలో రేపటి ప్రత్యేక పూజలు ఇవే!

image

వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు ఉదయం అభిషేక అర్చనలు, శ్రీరుక్మిణి విఠలేశ్వర స్వామివార్లకుకు పంచోపనిషత్ ద్వారా అభిషేకం మహాపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 17, 18వ తేదీల్లో అఖండ భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News July 16, 2024

WGL: నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్

image

చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించిన పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన కోల శ్రీను(33) కుటుంబానికి మాజీ మంత్రి KTR అండగా నిలిచారు. BRS సోషల్ మీడియా ఇంచార్జీ వినయ్.. పిల్లలను ఆదుకోవాలని ట్వీట్ చేయగా KTR స్పందించి పిల్లలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వినయ్‌తో మాట్లాడి పూర్తి వివరాలను KTR అడిగి తెలుసుకున్నారు.

News July 16, 2024

నెక్కొండ: బాలుడి మృతి ఘటన… సుమోటోగా స్వీకరణ

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండలో బాలుడి మృతి ఘటన కేసును తెలంగాణ వైద్య మండలి సుమోటోగా స్వీకరించారు. ఈమేరకు టీజీఎంసి రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల మనది పనే బాలునికి కుక్క కరవగా MGMలో 3 ARV ఇంజక్షన్లు వేయగా.. నాలుగోది RMP వద్ద వేయించారు. దీంతో ఐదు నిమిషాలలోపే మృతి చెందగా, విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మండిపడ్డారు.

News July 16, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైరల్ ఫీవర్లు

image

ఉమ్మడి WGL జిల్లాలో వైరల్ ఫీవర్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. MHBD జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి జులై వరకు 72 డెంగ్యూ, 34 మలేరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. ఈనెలలో డెంగ్యూ సోకినవారిలో నలుగురు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే జ్వరాలు వచ్చిన గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రక్తనమూనాలను సేకరిస్తున్నామని జిల్లా వైద్యాధికారిణి కళావతిబాయి తెలిపారు.

News July 16, 2024

WGL: భారీగా కురుస్తున్న వర్షాల సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్లు

image

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం వరంగల్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఏవైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3434, 91545 25936ను సంప్రదించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.

News July 16, 2024

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

image

ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఏండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో విడుదలైన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందామని లేఖలో పేర్కొన్నారు. ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతుక కుమార్ ఆపరేషన్‌ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామన్నారు. మావోయిస్టులపై నిషేధ ఆజ్ఞలు విధించడం తగదన్నారు.

News July 16, 2024

నేడు కొమరవెల్లి మల్లన్న ఆలయం హుండీల లెక్కింపు

image

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీలు, బియ్యం హండీలను మంగళవారం లెక్కించనున్నట్లు కొమురవెల్లి దేవస్థాన కార్యనిర్వాహక అధికారులు తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు హుండి లెక్కింపునకు హాజరుకావాలని కోరారు.

News July 15, 2024

WGL: పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. వరంగల్ డివిజన్‌లో 25 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT

News July 15, 2024

రామప్ప ఆలయంలో రేపు వేలంపాట

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఏడాది పాటు కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు మంగళవారం వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.1.50 లక్షల ధరావత్ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. దేవాలయ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని ఆయన సూచించారు.

News July 15, 2024

BREAKING: WGL: ‘వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణం బలి’

image

WGL జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. నెక్కొండ మండలం ముదిగొండ వాసి మణిదీప్(10)ను కుక్క కరిసింది. దీంతో MGMలో 3 ఏఆర్వీ ఇంజెక్షన్లను కుటుంబీకులు వేయించి, అనంతరం స్థానిక RMP దగ్గరకి తీసుకెళ్లగా 4వ ఇంజెక్షన్ వేశారు. వేసిన 5నిమిషాలకే బాలుడు కుప్పకూలడంతో 108లో మళ్లీ MGMకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు, RMPనిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.