India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువ అవుతోంది. ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. రోజూ కుక్కలతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి నుంచి ప్రాణాలను కాపాడలని హైకోర్టు హెచ్చరించినా.. క్షేత్రస్థాయిలో భయం తొలగడం లేదు. కాగా, ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరులో ఓ పిచ్చికుక్క ఏడుగురిపై దాడి చేయడం భయందోళనకు గురి చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు చేరుతోంది. శుక్రవారం 1,57,690 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా రెండు లక్షల 2,12,030 క్యూసెక్కులకు పెరిగింది. 85 గేట్లు ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని అధికారులు కిందికి వదులుతున్నారు.
బాలికపై ఓ వ్యక్తి త్యాచారానికి యత్నించిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో ఆదివారం జరిగింది. ఎస్సై వినయ్ కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై 26 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి యత్నించాడు.. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంటిస్థలం విషయమై అక్కాతమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదానికి పోలీసులు ప్రేమపూర్వక పరిష్కారం చూపించారు. తమ్ముడికి అక్కతో రాఖీ కట్టించి ఇద్దరిని ఏకం చేశారు. ఉర్సు కరీమాబాద్ కోయవాడకు చెందిన కోటమ్మ, ఆమె తమ్ముడు ఏడుకొండలు మధ్య వారసత్వ ఇంటి స్థలం కోసం గొడవ జరుగుతోంది. చివరికి కోటమ్మ.. తమ్ముడిపై మిల్స్ కాలనీ పీఎస్‌లో శనివారం ఫిర్యాదు చేసింది.
వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
> MHBD: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈవో
> HNK: పరకాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి
> JN: జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
> HNK: జిల్లా కేంద్రంలో సందడి చేసిన జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి
> BHPL: కాళేశ్వరంలో రెండు శివలింగాల కథ మీకు తెలుసా?
> MLG: కలెక్టర్, అధికారులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
> WGL: నగరంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
> MLG: గుర్తు తెలియని వాహనం ఢీకొని బాలుడి మృతి
> MHBD: నల్ల బెల్లం పట్టివేత
> MLG: నాటు సారా స్వాధీనం
> WGL: పెళ్లింట విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం
> MLG: గుండెపోటుతో మహిళ మృతి
> MLG: ఆటో బోల్తా.. పది మందికి గాయాలు
> WGL: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
> MLG: ఏడుగురిపై పిచ్చికుక్క దాడి
పరకాల పట్టణ కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గౌడ కులస్థులకు కాటమయ్య కిట్ల పంపిణీ చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. ఎస్సై సృజన్ కుమార్ తెలిపిన వివరాలు.. దేవరుప్పులకు చెందిన రంజిత్ ఫైనాన్స్‌లో కారు తీసుకొని నడుపుకొంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలో 3 నెలల కింద రోడ్డు ప్రమాదం జరిగి కారు ధ్వంసం కావడంతో పాటు అతడి కాలు విరిగింది. దీంతో అనారోగ్యానికి గురయ్యాడు. మనస్తాపం చెందిన రంజిత్ శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాళేశ్వరంలోని రెండు లింగాల వెనుక ఒక కథ ఉంది. యమధర్మరాజు శివుడి కోసం తపస్సు చేసి వరం పొంది స్వర్గానికి మించిన పట్టణం నిర్మించాలని విశ్వకర్మ వద్దకు వెళ్లాడట. గోదావరి- ప్రాణహిత నదుల సంగమ తీరంలో ఇంద్రలోకాన్ని మించిన పురాన్ని నిర్మించారని అదే కాళేశ్వరక్షేత్రం అని చెబుతారు. అలా శివుడి వరంతో ఈ క్షేత్రంలో(యముడు) ఈశ్వరుడు(శివుడు) ఒకే పానపట్టంపై కొలువయ్యారని కాళేశ్వర ఖండం చెబుతోంది.
Sorry, no posts matched your criteria.