Warangal

News December 25, 2024

ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు గురువారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

News December 25, 2024

రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించండి: వరంగల్‌ సీపీ

image

వరంగల్ సీపీ అంబ కిషోర్‌ ఝా వార్షిక తనిఖీల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రత దృష్ట్యా రాత్రి వేళలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతం మొక్కను నాటారు.

News December 24, 2024

వరంగల్: పెరిగిన సరకుల ధరలు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటా మొక్కజొన్న ధర రూ.2,505 పలకగా ఈరోజు రూ.2,510 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర సోమవారం రూ.16,000 పలకగా, నేడు రూ. 16,200 పలికినట్లు రైతులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News December 24, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజా మిర్చి క్వింటాకు సోమవారం రూ.15,200 ధర రాగా.. ఈరోజు రూ.15,800 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకి నిన్న రూ.13,500 ధర రాగా నేడు రూ.12,500 ధర పలికింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.14,500 ధర పలకగా మంగళవారం రూ.13,500 పలికింది.

News December 24, 2024

అల్లు అర్జున్, సుకుమార్‌పై మల్లన్న ఫిర్యాదు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నటుడు అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుష్ప-2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్‌లో ఉండగా హీరో మూత్రం పోశాడని, కొన్ని సీన్స్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయని మల్లన్న మండిపడ్డారు. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News December 24, 2024

వరంగల్: బ్లడ్ క్యాన్సర్‌తో ట్రైనీ కానిస్టేబుల్ మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకులు, స్థానికుల వివరాలు.. నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రాకేశ్(24) హైదరాబాదులోని ఓ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం జ్వరం రాగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. చికిత్స తీసుకుంటూ సోమవారం మృతి చెందాడు. దీంతో రాకేశ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 24, 2024

నలుగురు వేటగాళ్ల అరెస్ట్.. రిమాండ్

image

ములుగు జిల్లాలో గత కొంతకాలంగా వన్య ప్రాణుల్లో ఒకటైన అటవీ జంతువు ‘ అలుగు’ను వేటాడి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కన్నాయిగూడెం అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. కన్నాయిగూడెం మండలం భూపతిపూర్ కు చెందిన నలుగురు వ్యక్తులు ‘అలుగు’ జంతువులను వేటాడి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఎఫ్డీఓ రమేశ్, డీఆర్వో అప్సరున్నిసా తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామన్నారు.

News December 23, 2024

HNK: సిద్దేశ్వరునికి ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభూ లింగం శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో నేడు మార్గశిర మాసం సోమవారం ఆలయ అర్చకులు సిద్దేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్ తదితరులున్నారు.

News December 23, 2024

సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు, అధికారులకు మంత్రి కొండా సురేఖ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన సింగరేణి ప్రగతి పథాన సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

News December 23, 2024

భద్రకాళి అమ్మవారికి ఈరోజు అలంకరణ ఇదే

image

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని ఈరోజు అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. నేడు అష్టమి తిథి, సోమవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే తరలి వస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.