Warangal

News August 17, 2024

HNK: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డి.వాసంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, (ఉర్దూ), సైన్స్ సంబంధిత సబ్జెక్టులలో పీజీతో పాటు ఎంఈడీ అర్హత ఉన్నవారు ఈ నెల 21 వరకు డైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

News August 17, 2024

వరంగల్ మార్కెట్‌కు వరుసగా 3రోజులు సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం రాఖీ పర్వదినం సందర్బంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News August 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> WGL: మార్కెట్లో రికార్డు ధర పలికిన మక్కలు
> HNK: శ్రావణ మాసంలో భారీగా పెరిగిన పూల ధరలు
> MHBD: పలుచోట్ల KTR దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు
> BHPL: పర్యాటక ప్రాంతం: పాండవుల గుట్టలు
> JN: వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> MLG: ఏటూరునాగారంలో తేనేకు భలే డిమాండ్.
> HNK: సీఎం రేవంత్ రెడ్డి స్వయం కృషితో ఎదిగారు: మంత్రి సురేఖ
> MLG: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం

News August 16, 2024

ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> HNK: అమెరికాలో జిల్లా వాసి మృతి..
> MHBD: పల్టీ కొట్టిన బైకు.. ఇద్దరికీ గాయాలు..
> MLG: చల్వాయిలో ఫొటో స్టూడియోలో దొంగతనం..
> WGL: వారం రోజుల్లో భార్య ప్రసవం.. గుండె పోటుతో భర్త మృతి..
> JN: పాము కాటుతో రైతు మృతి..
> MLG: హత్య కేసులో ముగ్గురికి రిమాండ్..
> HNK: సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన సదస్సు..

News August 16, 2024

అమెరికాలో హనుమకొండ వాసి మృతి

image

అమెరికాలో హనుమకొండ జిల్లాకు చెందిన యువకుడు మృతిచెందాడు. ఆత్మకూరుకు చెందిన ఎరుగకొండ రాజేశ్ అమెరికాలో చనిపోయారు. ఎనిమిదేళ్లుగా రాజేశ్ అమెరికాలో ఉంటున్నారు. ఆయన మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 16, 2024

వరంగల్ మార్కెట్లో రికార్డు ధర పలికిన మక్కలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఈరోజు మొక్కజొన్న ధర రికార్డు నమోదయింది. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈరోజు క్వింటా మక్కల(బిల్టీ) ధర రూ.2805 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఇక్కడ చరిత్రలోనే ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర అని వ్యాపారులు తెలుపుతున్నారు. భారీ ధరలు పలుకుతుండటంతో మొక్కజొన్న పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 16, 2024

HNK: శ్రావణమాసంలో భారీగా పెరిగిన పూల ధరలు

image

శ్రావణ మాసంలో వరుస శుభకార్యాలు, వరలక్ష్మీ వ్రతాల కారణంగా హనుమకొండలో పూల ధరలు మూడింతలు పెరిగాయి. దీనికి వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడమూ ప్రభావం చూపుతోంది. గత నెలలో మల్లెల ధర కేజీ రూ.550లు ఉండగా ఇప్పుడు రూ.1,500 పలుకుతోంది. తెల్ల చామంతి రూ.200 నుంచి రూ.350, పసుపు చామంతి రూ.150 నుంచి రూ.400, కనకాంబరం రూ.100 నుంచి రూ.300, లిల్లీ రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ.1,200కు చేరాయి.

News August 16, 2024

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్యశారదా దేవి ఈరోజు వరంగల్ నగరంలోని పలు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని ఎంజీఎం, కేఎంసీ ఆసుపత్రులను తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అలాగే చికిత్స పొందుతున్న రోగుల నుంచి పలు విషయాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

News August 16, 2024

WGL: మార్కెట్లో క్వింటా పత్తి రూ.7125

image

గురువారం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున:ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత మొన్నటితో పోలిస్తే తగ్గింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తికి రూ.7,125 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News August 16, 2024

పర్యాటక ప్రాంతం.. పాండవుల గుట్టలు

image

BHPL జిల్లా రేగొండ మండలం రావులపల్లె సమీపంలోని పాండవుల గుట్టలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో కొన్నాళ్లపాటు ఈ గుట్టల్లోనే నివసించారట. అందుకే దీనికి పాండవుల గుట్ట అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ఎత్తైన గుట్టలు, లోతైన గుహలు, నీటి కొలనులు, రాక్ పెయింటింగ్స్ ఈ గుట్టల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గతంలో పాండవుల గుట్టలో రాక్ క్లైంబింగ్ కూడా ఉండేది.