India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేసముద్రం, స్టేషన్ ఘన్‌పూర్ మండలాలను మున్సిపాలిటీలుగా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కేసముద్రం పరిధిలో 40 గ్రామ పంచాయతీలు, స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలో 18 ఉన్నాయి. అయితే మున్సిపాలిటీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీఓ విడుదల చేయాల్సి ఉంది. మరి ఎన్ని గ్రామాలు మున్సిపాలిటీలో కలుస్తాయి..? ఎన్ని గ్రామాలు GPలుగానే కొనసాగుతాయి? అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోదారి రాజ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు. భూ వివాదంలో, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాగా పోలీస్ స్టేషన్‌లో మరి కొంతమంది ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు సమాచారం.
కొమురవెల్లి దేవస్థాన అధికారులు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఈనెల 29న జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవానికి రావాలని వారికి కళ్యాణ ఆహ్వాన పత్రికను అందజేశారు. బాలాజీ శర్మ, బుద్ధి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, మహదేవుని మల్లికార్జున్, లక్ష్మి, శ్రీనివాస్, కొమురయ్య, మల్లికార్జున్, భాస్కర్, బసవేశ్వర్ తదితరులున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు (శుక్రవారం) వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. ఈరోజు మార్కెట్కు పల్లి కాయ తరలిరాగా సూక పల్లికాయ క్వింటాకి రూ.3,100 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,600 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్న రూ. 12,200 ధర రాగా, కొత్త 341 రకం మిర్చికి రూ.14,500 పలికింది. నేడు మార్కెట్‌కు పసుపు రాలేదు.
ఫార్ములా ఈ కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చ జరపాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే తప్పు పట్టిన కేటీఆర్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారని, తన సమస్యను రాష్ట్ర సమస్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్‌కు నిజాయితీ లేదని విమర్శించారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు నేడు మొక్కజొన్న తరలివచ్చింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు మొక్కజొన్న ధర స్వల్పంగా పెరిగింది. గురువారం మార్కెట్లో క్వింటా మక్కలు (బిల్టీ) ధర రూ.2,500 పలకగా నేడు రూ.2510 పలికింది. అలాగే కొత్త తేజ మిర్చి సైతం మార్కెట్‌కి తరలిరాగా ఉన్నట్టు పోలిస్తే ధర భారీగా తగ్గింది. గురువారం కొత్త తేజ మిర్చి క్వింటాకు రూ.16,100 పలకగా నేడు రూ.15,500 పలికినట్లు రైతులు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 12 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా మారుస్తామని పేర్కొన్నారు. అందులో ఉమ్మడి జిల్లాలోని కేసముద్రం, స్టేషన్ ఘనపూర్, మద్దూరులను త్వరలోనే మున్సిపాలిటీగా చేస్తామన్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు వండర్ హాట్ మినహా అన్నిరకాల మిర్చి ధరలు తగ్గాయి. గురువారం తేజా మిర్చి క్వింటాకు రూ.15,500 పలకగా.. ఈరోజు రూ.15,000కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చి నిన్న క్వింటాకి రూ.15,000 ధర రాగా నేడు రూ.14వేలకు పతనమైంది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి గురువారం రూ. 13,500 ధర రాగా ఈరోజు రూ.14,500కి పెరిగింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగులో మొసలి ప్రత్యక్షమైంది. యాసంగి సాగు చేసుకోవడానికి వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులకు వాగులో పెద్ద బండపై సేద తీరుతున్న మొసలి కంటపడింది. ఇది చూసిన రైతులు భయపడ్డారు. పాకాల సరస్సు నుంచి ఆ మొసలి రావొచ్చని భావిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6, 120 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.5300 పలికింది. అలాగే పసుపు క్వింటాకి రూ.10,469 ధర రాగా… 5531 రకం మిర్చికి రూ. 12,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. రైతులు నాణ్యమైన సరుకులు మార్కెట్ కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.