Warangal

News July 12, 2024

వరంగల్: నిన్నటి కంటే రూ.1500 పెరిగిన మిర్చి ధర

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో శుక్రవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
> ఏసీ తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.నిన్నటిలాగే రూ.18,300 పలికింది.
> ఏసీ 341 రకం మిర్చి సైతం గురువారం లాగే రూ.14,500 పలికింది.
> వండర్ హాట్(WH) మిర్చి మాత్రం గత 2రోజులతో పోలిస్తే భారీగా పెరిగింది. మొన్న రూ.14,800 ధర పలకగా.. నిన్న రూ.15,000కి చేరింది. నేడు మరింత పెరిగి రూ.16,500 అయింది.

News July 12, 2024

వరంగల్: 24 హత్యలు, 59 హత్యాయత్నం కేసులు

image

వరంగల్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 7 నెలల్లో కమిషనరేట్ పరిధిలో 24 హత్యలు, 59 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాశీబుగ్గ, జులైవాడలో కుటుంబ తగాదాలతో భార్యలను భర్తలు హతమార్చారు. గతనెల 30న అర్థరాత్రి మట్టెవాడలో రోడ్డుపై నిద్రిస్తున్న కూలీని స్థానిక వ్యక్తి హత్య చేశాడు. భూ వివాదంలో బుర్హన్‌పల్లి మాజీ సర్పంచిని దారుణంగా హత్య చేశారు. నిన్న 16చింతల్‌లో దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే.

News July 12, 2024

WGL: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ ఎల్.శ్రీను వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలో ఓ బాలిక(16)ను గీసుకొండ మండలం రెడ్డిపాలెంకు చెందిన మదన్ బాబు(23) అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పక్షం రోజుల క్రితమే అతడిపై కేసు నమోదైందని, అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ గురువారం తెలిపారు.

News July 12, 2024

MHBD: మంచం పడుతున్న ఏజెన్సీ ప్రాంతం!

image

MHBD జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లోని పలుగ్రామాల ప్రజలు విష జ్వరాలకు వణికిపోతున్నారు. ఇంటికొకరు మంచానికి పరిమితమం అవుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీలో ఏ చిన్న జ్వరం వచ్చినా.. టౌన్‌కి రావాల్సి ఉండటంతో రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాలు, గూడేల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.

News July 12, 2024

FLASH.. ములుగు: లారీ, బస్సు ఢీ.. 15 మందికి గాయాలు

image

ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి ములుగు వైపు వస్తున్న లారీ, ములుగు నుంచి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మందికి గాయాలైనట్లు సమాచారం. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 12, 2024

WGL: కళా తోరణానికి పుష్ప సోయగం

image

జనగామ జిల్లా ముఖద్వారం పెంబర్తి శివారు ఏకశిలా కళా తోరణం వద్ద ఉన్న జాతీయ రహదారుల విభాగిని ముఖ్య కూడళ్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన పూలమొక్కలు ఆకట్టుకుంటున్నాయి. రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికుల మనసును దోచేలా ఉన్న పూల మొక్కలు, రంగు రంగుల పుష్పసోయగంతో తోరణం కొత్త అందాలను సంతరించుకుంది.

News July 12, 2024

జనగామ: పెళ్లి కావటం లేదని యువకుడు ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదు అనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో జరిగింది. పోలిసుల వివరాల ప్రకారం.. కంచనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(27) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి సరైన ఉపాధి లేదని, పెళ్లి సంబంధం కూడా రావడం లేదని మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

News July 12, 2024

SCAM ALERT .. WGL: రూ.50 వేలు ఇస్తే ఉద్యోగ నRయమక పత్రం!

image

డబ్బులిస్తే ANM, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులకు సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. అది నిజమనుకొని నిరుద్యోగులు DMHO ఆఫీస్‌కు పరుగులు తీస్తున్నారు. మీ పేరు జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీ జాబితాలో ఉందని, రూ.50 వేలు ఇస్తే వారంలో నియామక ఉత్తర్వులు అందిస్తామని కాల్ చేస్తున్నారు. అయితే వాటిని నమ్మొద్దని ఫోన్ వస్తే ఫిర్యాదు చేయాలని DMHO వెంకటరమణ స్పష్టంచేశారు.

News July 12, 2024

ముత్తు పదార్థాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్: సీపీ

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రై సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగం జరిగే ప్రాంతాల వివరాలను పోలీస్ కమిషనర్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వరంగల్‌లో గంజాయికి సంబంధించి నమోదయిన కేసుల వివరాలను ఆరా తీశారు. డ్రగ్స్ పై కఠినంగా ఉండాలన్నారు.

News July 12, 2024

‘వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టండి’

image

 గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని MHBD జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ,  అమ్మ ఆదర్శ పాఠశాలలు తదితర అంశాలపై సంబధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.