Warangal

News December 17, 2024

రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీతక్క

image

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నేడు హైదరాబాదులోని విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ వర్మ, సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి మంత్రి సీతక్క పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News December 16, 2024

జనగామ: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడి మృతి

image

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామ శివారులోని జాటోత్ తండాకి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ దర్గ్యా నాయక్(107)సోమవారం సాయంత్రం మరణించారు. జాటోత్ దర్గ్యా నాయక్ మృతికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, గ్రామస్థులు, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపి, సంతాపం వ్యక్తం చేశారు.

News December 16, 2024

ప్రతి గ్రామపంచాయతీ నుంచి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యం: సీతక్క

image

రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రం నుంచి గ్రామపంచాయతీకి రోడ్ల నిర్మాణం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. కొత్త రోడ్లను నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.

News December 16, 2024

ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూనే ఉంటాం: సిరికొండ

image

ప్రతిపక్ష పార్టీగా నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. కుల సంఘ భవనాల నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించి వారిని గౌరవించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. శాసనమండలికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

News December 16, 2024

HNK: సిద్ధేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మార్గశిర మాసం సోమవారం సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు చేపట్టారు. సిద్దేశ్వరుడిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దేశ్వర ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

News December 16, 2024

భద్రకాళి అమ్మవారికి సోమవారం అలంకరణ ఇదే!

image

తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్లోని భద్రకాళి ఆలయానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు సోమవారం కావడంతో అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తున్నారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు భక్తులు ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

News December 16, 2024

వరంగల్: పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి. గత 11 నెలల్లో 8,09,826 ఈ-చలాన్లు నమోదు అయ్యాయి. రూ.22,37,57,900 జరిమానా విధించారు. యావరేజ్‌గా రోజుకు 2,450, నెలకు 73,529 జరిమానా పడుతోంది. నెలకు 73,529 చలాన్లు, రోజుకు రూ.7 లక్షల జరిమానా పడి నెలకు రూ.2 కోట్లపైగా జరిమానా రూపంలో పడుతోంది.

News December 16, 2024

దుగ్గొండి: ఊరంతా ఎడ్యుకేట్సే!

image

దుగ్గొండి మండలంలోని పీజీతండాలో 120 ఇళ్లు ఉన్నాయి. అందులో 540 జనాభా ఉండగా ప్రతి ఇంటికి ఒక ఎడ్యుకేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా పలు ప్రభుత్వశాఖల్లో వారు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆగ్రామానికి పీజీతండా అని పేరు వచ్చింది. గ్రామపంచాయతీ గెజిట్‌లో కూడా పీజీ తండాగా ప్రచురితమైంది.

News December 15, 2024

వరంగల్ జిల్లా కేంద్రంలో పర్యటించిన స్పీకర్

image

వరంగల్ జిల్లా కేంద్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

News December 15, 2024

WGL: గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచన

image

గ్రూప్‌-2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. WGL‌- 28, HNK- 82, JNGM- 16, BHPL- 17, MHBD- 21, MULUGU- 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. సమయానికి చేరుకోవాలి’ అని సూచించారు. ALL THE BEST
SHARE IT