India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 16న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సత్య శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నందున రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందన్నారు.
మూరుమూల గ్రామాలన్నింటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సూపరిండెంట్ ఇంజినీర్ పి.మదుసూధన్ రావు తెలిపారు. గిరిజన పల్లెలకు విద్యుత్ సరఫరా అందించడాన్ని ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. వరంగల్ సర్కిల్ పరిధిలో టీఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా ఇప్పటి వరకు 43 ఎస్టీ ఆవాసాలకు వంద శాతం విద్యుధీకరణ పూర్తయిందన్నారు. విద్యుత్‌తో గ్రామాలన్ని అభివృద్ధి చెందుతాయన్నారు.
మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జిల్లా జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలురు 20ఏళ్లలోపు, 70 కేజీలలోపు బరువు ఉండాలని, బాలికలు 65 కేజీలలోపు బరువు కలిగి ఉండాలన్నారు. ఇక్కడ ఎంపికైన జట్లు ఈనెల 27, 28, 29, 30వ తేదీల్లో జనగామ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్షిప్‌లో పాల్గొంటారన్నారు.
రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా జిల్లా కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్ ఆధ్వర్యంలో మంత్రి రాజనర్సింహకు గొంగళి, మేక పిల్లను బహూకరించారు.
ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని హెచ్చరించారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, మెడికల్ కిట్, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలను పర్యవేక్షించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. తరగతి గదుల్లోని బెంచీలపై అతికించిన హాల్ టికెట్ నంబర్లను అత్యంత జాగ్రత్తగా, సక్రమంగా ఉండాలని సూచించారు.
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన, నాణ్యతపరమైన భోజన సదుపాయాలను ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట 63వ డివిజన్ బిసి బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. WGL కాశిబుగ్గకు చెందిన గుర్రపు రజిని- సమ్మయ్య దంపతుల కుమారుడి వివాహం ఆదివారం జరగనుంది. కాగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రజినికి శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు వచ్చి తనువు చాలించింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్‌కు త్వరలో మరిన్ని జంతువులు రానున్నాయి. సింహంతో పాటు రెండు తెల్లపులులను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జూ పార్క్‌కు రెండు పులులు కరీనా, శంకర్ వచ్చాయని, త్వరలో రెండు అటవీ దున్నలు(బైసన్‌లు) రానున్నట్లు భద్రాద్రి జోన్ సీపీఎఫ్ భీమానాయక్ చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని జంతువులు జూపార్క్‌కు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. స్వామి వారికి 73 రోజుల్లో రూ.81,68,044 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 146 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి, 26 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 550 కేజీలు వచ్చాయన్నారు.
Sorry, no posts matched your criteria.