Warangal

News January 1, 2025

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు సెలవు

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు (బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి గురువారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందన్నారు. రైతులు విషయాన్ని గమనించి నేడు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు.

News December 31, 2024

కొమురవెల్లి మల్లన్న ఆదాయం రూ.16.50 లక్షలు

image

కొమురవెల్లి మల్లన్న కళ్యాణం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.16.50 లక్షల మేరకు బుకింగ్ ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తలనీలాల సమర్పణ, ఆర్జిత సేవలు, పట్నాలు, బోనాలు, ప్రత్యేక దర్శనాలు, వసతి గదుల అద్దె, ప్రసాద విక్రయాలు ఇతర ద్వారా ఆదివారం రూ. 13.40 లక్షలు, సోమవారం లక్ష రూపాయల బుకింగ్ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

News December 31, 2024

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుక జరుపుకుందాం: CP

image

నూతన సంవత్సర వేడుకలను సంతోషకర వాతావరణంలో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకలు ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రతి ప్రాంతంలో పోలీస్ గస్తీ ఉంటుందని, వాహనదారులు మద్యం సేవించి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని జరిమానతో పాటు జైలుకు పంపిస్తామని CP హెచ్చరించారు.

News December 31, 2024

వరంగల్: బై బై 2024.. ఏం సాధించారు? ఏం కోల్పోయారు?

image

ఈ ఏడాది నేటితో పూర్తవుతోంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. చేసిన తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వాటన్నింటిని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేసుంటారు. మరీ ఈ ఏడాది మీరేం సాధించారు? ఏం కోల్పోయారు? ఏం నేర్చుకున్నారు? మీ మధుర జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి.

News December 31, 2024

NEW YEAR వేడుకలకు సిద్ధమైన వరంగల్!

image

కొత్త సంవత్సరం వేడుకలకు వరంగల్ సిద్ధమయింది. నేటితో 2024 సంవత్సరం ముగియనుండటంతో ఇప్పటికే నగరంతో పాటు.. గ్రామాల్లో వేడుకలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో నగరం మెరిసిపోతుండగా.. ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండగ వాతావారణం కనిపిస్తోంది. మరి ఈరోజు న్యూ ఇయర్ వేడుకలు మీరెలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 31, 2024

వరంగల్: ఉపాధ్యాయ నియోజకవర్గ తుది ఓటరు జాబితా విడుదల

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ తుది ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారు. కాగా ఉమ్మడి జిల్లాల్లో 200పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఇందులో 14,940 పురుషులు, 9,965మంది మహిళా ఉపాధ్యాయ ఓటర్ లు ఉన్నారు. మొత్తంగా 24,905 ఓటర్ లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 2,351మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

News December 30, 2024

పాలకుర్తి: సోమేశ్వర ఆలయంలో ప్రత్యేకపూజలు

image

మార్గశిర సోమావతి అమావాస్య సందర్భంగా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వరస్వామివారికి మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నపూజ, విశేష పూల అలంకరణ కార్యక్రమాన్ని ఉపప్రధాన అర్చకులు డీవీఆర్ శర్మ, ముఖ్య అర్చకులు అనిల్ శర్మ, నాగరాజు శర్మ ఆధ్వర్యంలో సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ఈఓ మోహన్ బాబు, పర్యవేక్షకుడు వెంకటయ్య, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News December 30, 2024

పాకాల అభయారణ్యంలో పెద్ద పులి!

image

కొన్ని రోజులుగా ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో సంచరిస్తున్న <<15014632>>పెద్ద పులి పాకాల <<>>అభయారణ్యంలోకి వెళ్లింది. మూడేళ్ల కిందట పాకాల అడవిలోకి వచ్చిన పులి.. మళ్లీ ఇప్పుడు వచ్చిందని అధికారులు గుర్తించారు. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మీదుగా పాకాల అడవిలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. పులి అడవిలోకి వెళ్లడంతో ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

News December 30, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MLG: విద్యుత్ షాకుతో రైతు మృతి..
> MHBD: కొమ్ములవంచలో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
> WGL: తిమ్మంపేట లో గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
> JN: డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
> WGL: తల్లి, కూతురు సూసైడ్ అటెంప్ట్
> MLG: అడవి పంది, అడవి కోడిని వేటాడిన వ్యక్తులపై కేసు
> WGL: ధర్మారంలో గుర్తుతెలియని మృతదేహం

News December 29, 2024

నల్లబెల్లి: కూతురు, తల్లి సూసైడ్ ATTEMPT

image

కూతురికి పురుగు మందు తాగించి తల్లి కూడా తాగిన ఘటన నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. శ్రీను సంతానం కోసం మానసను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో విఘ్నేశ్, సాత్విక జన్మించారు. కాగా కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పురుగు మందు తాగి కూతురికి కూడా తాగించింది. గమనించిన స్థానికులు 108లో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.