Warangal

News August 12, 2024

WGL: స్వల్పంగా పెరిగిన పల్లికాయ, పసుపు ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌కి నేడు పసుపు, పల్లికాయ తరలివచ్చాయి. క్వింటా సూక పల్లికాయకి రూ.6,450, పచ్చి పల్లికాయకు రూ.4,050 ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటా రూ.14,011 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. అయితే మొన్నటితో పోలిస్తే నేడు అన్ని రకాల సరకుల ధరలు స్వల్పంగా పెరిగాయని అధికారులు తెలిపారు.

News August 12, 2024

బ్యాంక్ మేనేజర్లతో మార్నేని రవీందర్ రావు సమీక్ష

image

డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్లతో టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రుణమాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు త్వరితగతిన తిరిగి కొత్త పంట రుణాలు ఇవ్వాలని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

News August 12, 2024

WGL టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు కొరియన్ కంపెనీలు ఆస్తకి: సీఎం

image

వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించిందన్నారు. టెక్స్‌టైల్ రంగం విస్తృతికి తాము తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు అనుకూలంగా ఉందని CM అన్నారు. WGL టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులను సీఎం వివరించారు.

News August 12, 2024

ప్రజావాణి నుంచి దరఖాస్తులను స్వీకరించిన వరంగల్ కలెక్టర్

image

వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతులు కలెక్టర్ డా.సత్య శారదా దేవి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

News August 12, 2024

కొమురవెల్లి ఆలయ భక్తులకు ముఖ్య గమనిక

image

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో బాలాజీ ముఖ్య సూచనలు చేశారు. నేటి నుంచి గర్భ గుడిలో ఫొటోలు నిషేధించనున్నట్లు తెలిపారు. ఆలయంలోని గర్భగుడిలో స్వామి వారి అమ్మవార్ల మూలవరుల ఫొటోలు తీసి సామాజిక మధ్యమాల్లో ప్రచురించడం వల్ల దేవాలయ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. భక్తులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News August 12, 2024

వరంగల్: నేడు క్వింటా పత్తి ధర రూ.7,160

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. దీంతో పత్తి తరలివచ్చినప్పటికీ.. ధర మాత్రం గత వారంలాగే పలికింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తికి రూ.7,160 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News August 12, 2024

MHBD: బోనాల పండుగ.. కోడిపుంజుకు బంగారు ఆభరణాలు

image

మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తొడేటి వెంకన్న అనే భక్తుడు బోనాల కోడిపుంజుకు బంగారు ఆభరణాలు అలంకరించి ఊరేగింపు చేశాడు. ఈ జాతరలో బోనాల కోడి అందరి దృష్టిని ఆకర్షించడంతో పలువురు సెల్ఫీలు.. ఫొటోలు దిగారు.

News August 12, 2024

వరంగల్: ఈ ఆలయం వద్ద దీపం వెలిగిస్తే అప్పులు తీరుతాయి!

image

చిల్పూర్ గుట్టపై వెలసిన శ్రీ గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. అక్కడ దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వెంకటేశ్వర స్వామి తన పెండ్లి కోసం కుబేరుడి దగ్గర చేసిన అప్పును తీర్చలేక ఈ గుట్ట పైకి వచ్చి గుబులుగా చింతిస్తూ.. ఓ గుహలో తపస్సు చేస్తుండగా వెలిసిన గుడినే ఇప్పుడు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

News August 12, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ వరంగల్ సీపీ తరుణ్ జోషి

image

వరంగల్ నగర మాజీ పోలీసు కమిషనర్, ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సవర్భంగా ఈవో శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో ఐపీఎస్ అధికారికి స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.

News August 12, 2024

WGL: వర్షాకాలం..? నిండని చెరువులు!

image

గత రెండు నెలలుగా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదుకాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా చేరలేదు. దీంతో రైతులకు వానలకోసం ఎదురుచూపులు తప్పట్లేదు. జిల్లాలో భూగర్భ జలాల సరాసరి నీటి మట్టం 8.09 మీ. లోతుకి పాతాళగంగ ఉండగా.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత లోతుకి వెళ్లాయి. ఆగస్టులో ఇప్పటివరకు 85.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 76.4మి.మీ మాత్రమే నమోదైంది.