India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు అభిషేకం నిర్వహించారు. నేడు అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడంతో తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 1వ తేదీన చెల్పాక అడవుల్లోని పూలకమ్మ వాగు వద్ద గ్రేహౌండ్స్ బలగాలు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట లేఖ విడుదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ బందుకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.16,000 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా నేడు రూ.13,500 పడిపోయింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.14,100 ధర రాగా.. నేడు రూ.14,500 కి చేరింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
కేరళ సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరుగుతూ నర్సంపేటలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకమైనదిగా కొనసాగుతోంది. 24ఏళ్ల క్రితం దాతల సహకారంతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి ఏటా శబరిమలలో అయ్యప్పకు జరిగే విశేష పూజలైన ఉత్సవబలి, క్షేత్రబలి, పల్లివేట, పంబా ఆరాట్‌లనూ ఇక్కడ నిర్వహిస్తున్నారు. పంబా ఆరాట్ వేడుకలకు వివిధ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఆగస్టు 31న ఇదే ప్రాంతంలోని మేడారం అడవుల్లో లక్షల సంఖ్యలో భారీ చెట్లు నేలకొరిగాయి. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే భారీ వృక్షాలు టోర్నడో తరహాలో విరిగి పడగా, వాటిపై ఇంకా అటవీశాఖ అధికారుల పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది.
ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల్లో ఒకరైన ముసాకి దేవల్@ కరుణాకర్ ఐదేళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లాడని తండ్రి బుజ్జ తెలిపారు. భార్య రీత కూడా దళసభ్యురాలు కావడం గమనార్హం. కాగా, ఏడాదిక్రితం చర్ల వద్ద రీతను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం ఖమ్మంలో జైలు జీవితాన్ని అనుభవిస్తోంది. చిన్నతనంలోనే తల్లి చనిపోగా తండ్రి బుజ్జ మాటవినకుండా అడవిలోకి పోయి, ఎన్‌కౌంటర్ర్లో చనిపోయినట్లు తెలిపాడు.
ఈనెల 5న ప్రారంభం కానున్న ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి మంత్రి సీతక్క ఆహ్వానం అందజేశారు. ఇందిరా మహిళా శక్తి బజార్ మహిళా శక్తి పథకంలో కీలక మలుపు అని, ఆర్థిక స్వావలంబన దిశగా శ్రీకారం అని మంత్రి సీతక్క చెప్పారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెలుగులు తీసుకువస్తామని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. గత ఏడాది ఇదే రోజున వరంగల్ తూర్పు ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ప్రజల ఆకాంక్షలన్నీ అమలు చేస్తూ ముందుకు సాగుతుంటానని మంత్రి తెలిపారు.
నవంబర్ 30వ తేదీ 2023వ జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భూపాలపల్లి, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, ములుగు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.15,000 ధర రాగా నేడు రూ.15,300కి పెరిగింది. అలాగే కొత్త తేజా మిర్చికి నిన్నటిలాగే రూ.14,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు 341 రకం మిర్చి నిన్న రూ.13,500 పలకగా, నేడు రూ.14,500 అయింది. వండర్ హాట్(WH) మిర్చికి సోమవారం రూ.11,000 ధర రాగా నేడు రూ.14వేలు వచ్చిందన్నారు.
Sorry, no posts matched your criteria.