Warangal

News August 11, 2024

WGL: మరణంలోనూ వీడని బావ, బామ్మర్దుల బంధం

image

రోడ్డు ప్రమాదంలో శనివారం <<13825176>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. బంధువుల ప్రకారం.. వేలేరు మం. మల్లికుదుర్లకు చెందిన మల్లారెడ్డి(52), అమరేందర్ రెడ్డి(42) మేనబావ, బామ్మర్దులు. వీరి వయసులో వ్యత్యాసం ఉన్నా స్నేహితుల్లాగే ఉండేవారు. ఈ క్రమంలోనే బైకుపై వెళ్తుండగా నిన్న సా. జానకీపురం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టి 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News August 11, 2024

జనగామ: రామాయణాన్ని వాల్మీకి ఇక్కడే రచించారు!

image

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. గుట్టపై అప్పట్లో సీతారామ, లక్ష్మణులు నివసించారని స్థానికులు చెబుతుంటారు. వాల్మీకి మహర్షి జన్మస్థలంగా ఉన్న ఒకప్పటి వాల్మీకిపురమే నేటి వల్మిడి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి గుట్టపై వాల్మీకి రామాయణం రచించారని చరిత్రకారుల అభిప్రాయం. కొండపై ఉన్న గుండం ఎంత కరవు కాలం వచ్చినా ఎండిపోకపోవడం విశేషం.

News August 11, 2024

వరగంల్: పసి ప్రాణాలను కాపాడేదెవరు?

image

వరంగల్ జిల్లాలో అమానవీయ ఘటనలు పెరుగుతున్నాయి. MGMలో శుక్రవారం కుక్కలు నోటకరచి తీసుకెళ్తున్న 2-3 రోజుల వయస్సున్న మృతశిశువును పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఈ ఏడాది మే 4న ఒక పసిపాపను మట్టిలో కదులుతున్న ఓ లారీ డ్రైవర్ గుర్తించాడు. గతేడాది డిసెంబర్‌లో తొర్రూరు డివిజన్ కేంద్రంలో మురుగు కాలువలో 7-9 రోజుల వయసున్న పసిబాబు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలతో ఈ ఘోరాలను ఆపేదెవరంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.

News August 11, 2024

కాజీపేట మీదుగా ఇండిపెండెంట్ డే స్పెషల్ రైలు

image

ఇండిపెండెంట్ డేను పురస్కరించుకొని కాజీపేట మీదుగా హైదరాబాద్-సంత్రగాచి స్పెషల్ రైలు నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 14, 15వ తేదీల్లో ఈ రైలు నడిపించనున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 5:30కు బయలుదేరి కాజీపేటకు 7:30 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, విజయవాడ,ఖమ్మం, ఏలూరు స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

News August 11, 2024

HNK: నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి.పూర్ణిమ శనివారం తెలిపారు. ఆదివారం నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు www.navodaya.gov.in వెబ్‌సైట్లో చే వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

News August 11, 2024

MLG: హాస్టల్ ఘటనపై సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క

image

మలక్‌పేట హాస్టల్ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కేసు విచార‌ణ త్వ‌రితగ‌తిన పూర్తిచేసి త‌ప్పు చేసిన వారు ఎంతటి వారైనా క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, వేధింపులను రాష్ట్ర ప్ర‌భుత్వం ఉపేక్షించ‌ద‌ని, క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తుంద‌ని సీతక్క చెప్పుకొచ్చారు.

News August 10, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> MHBD: మహిళా వేషధారణలో వ్యక్తి పర్యటన
> JN: అకౌంట్ నుంచి 11 లక్షల రూపాయలు కొట్టేశారు
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహం
> WGL: మూడెకరాల పత్తి పంటను పీకేసిన గుర్తు తెలియని వ్యక్తులు
> WGL: ఈ గ్రంథాలయంలో 90 వేల పుస్తకాలు
> MLG: ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడి సెంటర్లు ఏర్పాటు చేయాలి: సీతక్క
> HNK: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు

News August 10, 2024

ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> HNK: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
> BHPL: ప్రభుత్వ పాఠశాల అటెండర్ ఆత్మహత్య
> WGL: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
> MLG: ట్రాక్టర్ కిందపడి ఒకరు మృతి
> MLG: గుడుంబా స్వాధీనం.. ఐదుగురిపై కేసు
> MHBD: గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం
> HNK: మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

News August 10, 2024

ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన శనివారం ధర్మసాగర్ మండలం జానకిపురంలో చోటుచేసుకుంది. ధర్మసాగర్ సీఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మళ్లీకుదుర్ల గ్రామానికి చెందిన గురజాల మల్లారెడ్డి, సారంపెళ్లి అమరేందర్ రెడ్డి బైకుపై ధర్మసాగర్ వైపు వెళ్తుండగాఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 10, 2024

కేసముద్రం: మహిళా వేషధారణలో వ్యక్తి పర్యటన

image

మహిళా వేషధారణ వేసుకొని ఓ వ్యక్తి కేసముద్రంలో పర్యటిస్తున్నాడు. ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి చొరబడి డబ్బులు అడగాడు. దీంతో ఆమె భయంతో బయటికి పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానికులు అతడిని విచారించారు. నాందేడ్ వాసిగా గుర్తించారు. అతడు బిక్షాటనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతని వద్ద కొడవలి ఉన్నట్లు స్థానికలు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.