Warangal

News August 10, 2024

WGL: వందేభారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పు

image

వరంగల్ మీదుగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20833/20834) షెడ్యూల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నిర్వహణ కోసం ప్రస్తుతం ప్రతీ ఆదివారం సెలవు ఉండగా.. డిసెంబర్ 10 నుంచి ప్రతి ఆదివారం రైలు నడుస్తుందని..అప్పట్నుంచి మంగళవారం సెలవు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

News August 10, 2024

MHBD మహిళా ఇన్‌ఛార్జిగా విజయలక్ష్మి

image

బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇన్‌ఛార్జిగా బానోతు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కష్టపడి పని చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు.

News August 10, 2024

శిశువు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. UPDATE

image

MGM ఆవరణలో నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై WGL కలెక్టర్ సత్య శారదా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు DCP స్థాయిలో విచారణ చేపట్టారు. శిశువును వదిలించుకోవాలని ఎవరైనా వదిలేశారా? లేక MGMలో పనిచేస్తున్న సిబ్బంది దీనికి కారణమా? అనే కోణంలో పోలీసులు CC కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే శిశువుకు బొడ్డు, కాలు భాగాలు లేకపోవడంతో ఆడ, మగ అన్నది గుర్తించ లేకుండా ఉంది.

News August 10, 2024

వరంగల్: దేవాదాయ శాఖలో బదిలీలు

image

దేవాదాయ శాఖలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 8 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 6బి కేటగిరీకి వచ్చే దేవాలయాల నుంచి ఇద్దరు, రీజినల్ జాయింట్ కమిషనర్ పరిధిలోకి వచ్చే 6ఏ దేవాలయాల్లో ఆరుగురికి బదిలీలు జరిగాయి. వేయి స్తంభాల గుడిలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్ ఐనవోలుకు, ఐనవోలు ఆలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మధుకర్ వేయిస్తంభాల గుడికి వచ్చారు.

News August 10, 2024

వరంగల్: ఈ గ్రంథాలయంలో 90వేల పుస్తకాలు

image

WGLలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆకర్షణీయంగా నిలుస్తోంది. రూ.2కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని రంగంపేటలో నిర్మించిన ఈ గ్రంథాలయంలో 90 వేలకు పైగా పుస్తకాలున్నాయి. శిథిలావస్తలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికీకరించిన తర్వాత ఇక్కడకు వచ్చే పాఠకుల సంఖ్య క్రమంగా పెరిగింది. రోజుకు సుమారు 900 మంది పాఠకుల వరకు వస్తున్నారు. ప్రతి రోజు ఉ.8 నుంచి రా.8 వరకు చదువుకోవచ్చు. మీరూ ఇక్కడకు వెళ్లుంటే కామెంట్ చేయండి.

News August 10, 2024

వరంగల్: దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారు. సంగీత(24), అక్బర్ పాష(27)లు రెండేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకొని శివనగర్‌లోని రుద్రమ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆరుబయట మాట్లాడుకుంటున్న సమయంలో బైకుపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు.

News August 10, 2024

ఉమ్మడి వరంగల్లో పలువురు సీఐల బదిలీ

image

తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్-1 పరిధిలోని పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్ సీఐగా కె.జగదీశ్, కురవి సీఐగా రాజకుమార్ గౌడ్, అలాగే డోర్నకల్ సీఐగా బీ.రాజేశ్ బదిలీపై రానున్నారు.

News August 10, 2024

భద్రకాళి ఆలయంలో రికార్డు ఆదాయం

image

తొలి శ్రావణ శుక్రవారం, నాగుల పంచమి పర్వదినం సందర్భంగా నిన్న భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. ఈ క్రమంలోనే భద్రకాళి ఆలయంలో గతంలో ఎన్నడూలేని విధంగా శుక్రవారం ఒక్కరోజే రూ.4.40 లక్షల రికార్డు ఆదాయం లభించిందని ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. శుక్రవారం మీరూ అమ్మవారిని దర్శించుకుంటే కామెంట్‌లో తెలపండి.

News August 10, 2024

వరంగల్ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్ కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. .

News August 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్..

image

> HNK: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు
> HNK: పైపులో ఇరుక్కుపోయిన కుక్క తల
> WGL: మార్కెట్లో పెరిగిన మిర్చి, పత్తి ధర
> WGL: పాకాల సరస్సుకు మత్తడి
> MLG: సీతక్క నాకు సిస్టర్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
> WGL: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి: సీపీ
> BHPL: రైతులు ఎలాంటి అపోహలు చెందొద్దు: కలెక్టర్
> JN: ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తా: కడియం శ్రీహరి