Warangal

News August 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

> హన్మకొండలో విషాదం.. తండ్రి, కూతురు సూసైడ్
> MLG: శిశువు విక్రయం.. ఇద్దరిపై కేసు నమోదు
> BHPL: దొంగల భీభత్సం..
> BHPL: కారు బోల్తా..
> MHBD: యువకుడిపై వీధి కుక్కల దాడి
> MHBD: అనారోగ్యంతో మత్స్య శాఖ మాజీ అధ్యక్షుడి మృతి..
> WGL: డెంగ్యూతో బాలిక మృతి..
> MHBD: గుర్రం బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు..

News August 9, 2024

హనుమకొండలో విషాదం… తండ్రి, కూతురు సూసైడ్

image

హనుమకొండ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. వరంగల్ ఓ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగి అనే జర్నలిస్ట్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతోపాటు కూతురు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 9, 2024

ములుగు: శిశువు విక్రయం..ఇద్దరిపై కేసు నమోదు

image

శిశువును విక్రయించిన, కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ఆడశిశువును తండ్రి జంపయ్య.. రామన్నగూడెం గ్రామానికి చెందిన సుధాకర్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయం ఇటీవలే వెలుగులోకి రావడంతో, కొనుగోలు చేసిన సుధాకర్, విక్రయించిన జంపయ్యపై ప్రొటెక్షన్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.

News August 9, 2024

సీతక్క నాకు సిస్టర్ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

image

తనకు 8 మంది సిస్టర్స్ అని, సీతక్క తొమ్మిదవ సిస్టర్ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీతక్క ప్రసంగం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ప్రజల్లో సీతక్క మంచి పేరు సంపాదించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

News August 9, 2024

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వనదేవతల ప్రతిమ అందజేత

image

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారమ్మ ప్రధాన పూజారి జగ్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ వనదేవతల ప్రతిమల జ్ఞాపికను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సారలమ్మ పూజారి కాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

News August 9, 2024

వరంగల్: మళ్లీ పెరుగుతున్న మక్కల ధర!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలలో రూ.2,780 రికార్డు ధర పలికిన క్వింటా మొక్కజొన్న (మక్కలు) పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ ఈ వారం నుంచి పెరుగుతున్నాయి. ఈ వారం మొదట్లో రూ.2,700 పలికిన మక్కలు నేడు రూ.2,745 కి పెరిగిందని అధికారులు తెలిపారు.

News August 9, 2024

కేయూలో ఆదివాసీ దినోత్సవం

image

కాకతీయ యూనివర్సిటీ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫస్ట్ గేట్ నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వరకు ర్యాలీ తీసి ఆదివాసీ సంస్కృతి, వేషధారణతో విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. పెద్ద ఎత్తున కేయూ విద్యార్థులు ఆదివాసీ దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

News August 9, 2024

HNK: పైపులో ఇరుక్కుపోయిన కుక్క తల

image

ఆహారం కోసం ఎదురు చూస్తూ పైపులో కుక్క తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయి 3 రోజులు నరకయాతన అనుభవించింది. HNK శ్యామల దుర్గాదాస్ కాలనీలో మూడు రోజుల కిందట రోడ్డు పక్కన పడి ఉన్న ప్లాస్టిక్ పైపులో కుక్క తల దూర్చింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడంతో అరుస్తూ వీధుల్లో సంచరించింది. వడ్డేపల్లి పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ కుక్కకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పైపు కోసి కుక్కను రక్షించారు.

News August 9, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన WH మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,000 పలికింది. అలాగే 341 రకం మిర్చికి సైతం నిన్నటి లాగే కూడా రూ.14 వేలు పలికింది. అయితే వండర్ హాట్(WH) మిర్చి ధర మాత్రం నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. నిన్న రూ.14,500 పలికిన మిర్చి నేడు రూ.15,500కి చేరింది.

News August 9, 2024

వరంగల్: పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిచ్చాయి. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు పెరిగాయి. సోమవారం రూ.7,160 పలికిన పత్తి.. మంగళవారం, బుధవారం రూ.7,100, గురువారం మరింత తగ్గి రూ.7055కి చేరింది. ఐతే ఈరోజు రూ.7,130కి పెరిగింది. దీంతో అన్నదాతలకు కొంత ఉపశమనం కలిగినట్లు అయింది.