India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొద్దిరోజులుగా పత్తి ధర రూ.7 వేలకు పైగా పలుకుతోంది. సోమవారం రూ.7,010 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.7,000, బుధవారం రూ.7,030 పలికాయి. అలాగే నేడు రూ.7,020 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్‌కి ఈరోజు పత్తి తరలి రాగా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
మొగిలయ్య పాటకు చెమర్చని కళ్లు లేవని, చలించని హృదయం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మొగిలన్న పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటిందని, మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపిందని కేటీఆర్ చెప్పారు. మొగిలయ్య మరణించినా పాట రూపంలో బతికే ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య నిరుపేద కుటుంబానికి చెందిన జానపద కళాకారుడు. డైరెక్టర్ వేణు తీసిన బలగం సినిమాలో మొగిలయ్యకు అవకాశం ఇచ్చారు. సినిమా చివరిలో పాడిన పాటకు విశేష ఆదరణ వచ్చింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వేణుతో పాటు పలువురు ఆర్థిక సాయం చేశారు. ఆయన <<14919458>>నేడు మృతి <<>>చెందడంతో దుగ్గొండిలో విషాదం చోటుచేసుకుంది.
ములుగు జిల్లాలో 9 రోజులుగా పెద్ద పులి సంచరించడం సంచలనంగా మారింది. వెంకటాపురం మండలం ఆలుబాక, బోధపురం గోదావరి సమీపంలో ఈ నెల 10న పెద్దపులి పాదముద్రలు కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మంగపేట, తాడ్వాయి సమీప అడవుల్లో సంచారం కొనసాగిస్తుంది. పులి అడుగుజాడలు ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో కొత్త తేజ మిర్చి ధర ఈరోజు పెరిగింది. సోమవారం క్వింటా కొత్త తేజ మిర్చి ధర రూ.15,516 ధర పలికింది. ఈరోజు మళ్లీ తగ్గి మంగళవారం రూ. 15,500 అయిందని వ్యాపారులు తెలిపారు. అయితే గత రెండు రోజులతో పోలిస్తే మిర్చి ధర ఈరోజు పెరిగింది. నేడు క్వింటా కొత్త మిర్చి ధర రూ.15,800కి చేరిందని చెప్పారు.
తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో నేడు బుధవారం ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చనిపోయిన వ్యక్తి బిహార్‌లోని కగారియా ప్రాంతానికి చెందిన దిల్కుష్ కుమార్ (18)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అసెంబ్లీలో ఈరోజు నల్లచొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో BRS నేతలు చేసిన నిరసనపై మంత్రి సీతక్క కామెంట్స్ చేశారు. KTR, హరీశ్ బేడీలు వేసుకోలేదని, కేవలం వారి పార్టీ MLAలకే బేడీలు వేశారన్నారు. ఈ ఘటనతో KTR, హరీశ్ దొరతనం మరోసారి బయటపడిందన్నారు. నిరసనలో కూడా BRS నేతల్లో సమానత్వం లేదని, తమ దురంహకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన అంశంపై CM సీరియసై చర్యలు తీసుకున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నేడు హైదరాబాదులోని విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ వర్మ, సీఎం రేవంత్ రెడ్డిలతో కలిసి మంత్రి సీతక్క పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామ శివారులోని జాటోత్ తండాకి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోత్ దర్గ్యా నాయక్(107)సోమవారం సాయంత్రం మరణించారు. జాటోత్ దర్గ్యా నాయక్ మృతికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, గ్రామస్థులు, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపి, సంతాపం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.