India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రం నుంచి గ్రామపంచాయతీకి రోడ్ల నిర్మాణం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. కొత్త రోడ్లను నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.
ప్రతిపక్ష పార్టీగా నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాసనమండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. కుల సంఘ భవనాల నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించి వారిని గౌరవించిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. శాసనమండలికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
హన్మకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మార్గశిర మాసం సోమవారం సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలు చేపట్టారు. సిద్దేశ్వరుడిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దేశ్వర ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పల ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్లోని భద్రకాళి ఆలయానికి ఈరోజు భక్తులు తరలివచ్చారు. నేడు సోమవారం కావడంతో అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తున్నారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు భక్తులు ఆలయ పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి. గత 11 నెలల్లో 8,09,826 ఈ-చలాన్లు నమోదు అయ్యాయి. రూ.22,37,57,900 జరిమానా విధించారు. యావరేజ్‌గా రోజుకు 2,450, నెలకు 73,529 జరిమానా పడుతోంది. నెలకు 73,529 చలాన్లు, రోజుకు రూ.7 లక్షల జరిమానా పడి నెలకు రూ.2 కోట్లపైగా జరిమానా రూపంలో పడుతోంది.
దుగ్గొండి మండలంలోని పీజీతండాలో 120 ఇళ్లు ఉన్నాయి. అందులో 540 జనాభా ఉండగా ప్రతి ఇంటికి ఒక ఎడ్యుకేట్ ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, సీఐలు, ఎస్సైలు, ఏఈలు ఇలా పలు ప్రభుత్వశాఖల్లో వారు ఉద్యోగాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఎన్నారైలు ఉన్నారు. దీంతో ఆగ్రామానికి పీజీతండా అని పేరు వచ్చింది. గ్రామపంచాయతీ గెజిట్‌లో కూడా పీజీ తండాగా ప్రచురితమైంది.
వరంగల్ జిల్లా కేంద్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్-2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. WGL- 28, HNK- 82, JNGM- 16, BHPL- 17, MHBD- 21, MULUGU- 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. సమయానికి చేరుకోవాలి’ అని సూచించారు. ALL THE BEST
SHARE IT
ఈనెల 16న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సత్య శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నందున రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందన్నారు.
మూరుమూల గ్రామాలన్నింటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సూపరిండెంట్ ఇంజినీర్ పి.మదుసూధన్ రావు తెలిపారు. గిరిజన పల్లెలకు విద్యుత్ సరఫరా అందించడాన్ని ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. వరంగల్ సర్కిల్ పరిధిలో టీఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా ఇప్పటి వరకు 43 ఎస్టీ ఆవాసాలకు వంద శాతం విద్యుధీకరణ పూర్తయిందన్నారు. విద్యుత్‌తో గ్రామాలన్ని అభివృద్ధి చెందుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.