India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కార్పొరేట్ కంపెనీలు గ్రామాలకు తరలి రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాదులోని ప్రజా భవన్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్వాల్కమ్, బోష్, గ్రాన్యుల్స్ ఇండియా, టీసీఎస్, ఉషా, నిర్మాన్, తదితర కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు.
ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ హుండీ లెక్కించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు అనిల్ తెలిపారు. ఆలయ ఆదాయం రూ.3,95,140లు వచ్చినట్లు పేర్కొన్నారు. రూ.3,76,535ల నోట్లు, రూ.18,605ల నాణాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, అర్ఐ రమేశ్, అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్, ఏఎస్సై కిష్టయ్య, పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా సూక పల్లికాయ రూ.6,590, పచ్చి పల్లికాయకు రూ.4,750 ధర వచ్చింది. పసుపు క్వింటా రూ.13,859 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు మక్కలు క్వింటాకి రూ. రూ.2,715 పలికాయి. అయితే నిన్నటితో పోలిస్తే నేడు అన్ని రకాల సరకుల ధరలు పెరిగాయి.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు తెలిసింది. నర్సంపేటకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలకు NMC నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల మూడో వారంలో కాలేజీని CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి WGL జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో CM పర్యటనపై చర్చించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు మంగళవారం రూ.18,500 పలకగా.. నేడు రూ.17,500కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14 వేలు పలకగా.. నేడు రూ.15 వేలకు చేరింది. నిన్న రూ.14,800 ధర పలికిన వండర్ హాట్(WH) మిర్చి.. నేడు రూ.15,500కి పెరిగింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్థంగా ఉంది. మంగళవారం లాగే ఈరోజు క్వింటా పత్తి ధర రూ. 7,100 పలికింది. సోమవారం రూ.7,160 పలికిన పత్తి.. నిన్న, ఈ రోజు రూ. 7100కి పడిపోయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు నాణ్యమైన, తేమ లేని సరుకులు మార్కెట్‌కు తీసుకువచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి శంకర్‌రావు విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రవేశ రుసుం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని చెప్పారు. పూర్తి వివరాలకు 8008403631, 9396337572 నంబర్లను సంప్రదించాలన్నారు.
మారు వేషంలో వచ్చిన బంగారు లేడిని శ్రీరాముడు పట్టుకునే సమయంలో శ్రీ రామచంద్రస్వామి ఆలయం ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం జీడికల్ గ్రామంలో ఉంది. గుడి సమీపంలో ఉన్న కోనేరులో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఏటా శ్రీరామనవమి, కార్తీక మాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది. దీనిని రెండో భద్రాద్రి అని పిలుస్తారు. ఈ ఆలయం పేరిట గుంటూరులో 11 ఎకరాల భూమి ఉండటం విశేషం.
హరిత నిధి పురోగతి అంశంపై నేడు సచివాలయంలో అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. హరితనిధి నిధులతో వరంగల్, ములుగు డీఎఫ్ఓల అధికార పరిధిలో వరంగల్ నగరం నుంచి మేడారం వరకు మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్, మీడియన్ ప్లాంటేషన్‌ను చేపట్టేందుకు స్టేట్ లెవల్ కమిటీ ఆమోదం తెలిపింది. హరితనిధి ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
> JN: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
> MHBD: విష జ్వరంతో కాంగ్రెస్ నాయకుడు మృతి
> WGL: బైకును ఢీ కొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
> MHBD: బ్రెయిన్ డెడ్ అయి వ్యక్తి మృతి
> JN: రైలు ఢీకొని వ్యక్తి మృతి
> HNK: మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు
> JN: వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత
Sorry, no posts matched your criteria.