Warangal

News November 20, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. UPDATE

image

జనగామ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14656765>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. బచ్చనపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన కరుణాకర్, సాయిబాబా రైతులు. అయితే వారి ట్రాక్టర్లకు సామగ్రి తీసుకురావడానికి చేర్యాలకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. కాగా, బైకు నుజ్జునుజ్జయింది.

News November 20, 2024

వరంగల్ పట్టణానికి ఇందిరమ్మ ప్రభుత్వంలో మహర్దశ: మంత్రి

image

గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ పట్టణానికి, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మహర్దశ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్ట్, టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు వరంగల్ పట్టణాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో ముందు నిలబెట్టడం కోసం మన ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనుందని చెప్పారు.

News November 20, 2024

ఓరుగల్లు చరిత్రలో మరుపురాని రోజుగా ఈరోజు నిలిచిపోతుంది: భట్టి

image

ఓరుగల్లు చరిత్రలో మరుపురాని రోజుగా ఈరోజు నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. వరంగల్ పట్టణాన్ని మహా నగరంగా మార్చడానికి దాదాపుగా రూ.6 వేల కోట్ల నిధులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. మహిళల ఎదుగుదలకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మహిళా సంఘాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం దేశ చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయమని ట్వీట్ చేశారు.

News November 20, 2024

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కొండా దంవపతులు

image

హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, మంత్రి సురేఖ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు సమావేశంలో చర్చించారు.

News November 20, 2024

సీఎంకు జ్ఞాపికను అందజేసిన MLA నాయిని

image

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్త్రీ శక్తి గురించి తెలిపే ప్రత్యేకంగా తయారు చేయించిన జ్ఞాపికను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

News November 20, 2024

ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వేపై కలెక్టర్‌తో రివ్యూ నిర్వహించిన సీఎస్

image

TS చీఫ్ సెక్రటరీ శాంత కుమారి నేడు జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు, సమగ్ర సర్వే మీద కలెక్టర్‌తో రివ్యూ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సాఫిగా కొనసాగుతుందని, చెల్లింపులు కూడా ఎప్పటికప్పుడు అయ్యేలా OPMSలో వివరాలను నమోదు చేస్తున్నట్లు సీఎస్‌కు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు దొడ్డు రకం ధాన్యానికి రూ.78 కోట్లు, సన్నలకు రూ.కోటి వరకు చెల్లించామన్నారు.

News November 20, 2024

వరంగల్‌: ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్న అధికారులు 

image

వరంగల్‌లో నేడు జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయక బృందాల ద్వారా టీజీఎస్ ఆర్తీసుకుంటున్న అద్దె బస్సుల ఒప్పందాన్ని ఉన్నతాధికారులు కుదుర్చుకున్నారని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలను ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్ పరస్పరం మార్చుకున్నారు.

News November 20, 2024

సంతోషపు దివ్వెలు.. శాశ్వతం చేయాలన్నదే నా సంకల్పం: సీఎం

image

ఇందిరమ్మ రాజ్యంలో అందరు అమ్మల మొహల్లో ఈ నవ్వులు, సంతోషపు దివ్వెలు.. శాశ్వతం చేయాలన్నదే నా సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. హనుమకొండలో నిర్వహించిన సభకు సంబంధించిన ఫోటోలను ‘X’లో సీఎం జత చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఛైతన్యపు రాజధాని, కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల వరంగల్ అని అన్నారు.

News November 20, 2024

వరంగల్: సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞాపికను అందించి మంత్రి కొండా

image

హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో కాంగ్రెస్ చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ భద్రకాళి అమ్మవారు, కాకతీయ కళా తోరణంతో కూడిన జ్ఞాపికను అందించారు. మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ జిల్లా యూత్ నాయకులు బొల్లం శివకుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞాపకం అందజేశారు. ఈ సభకు కొండాభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

News November 19, 2024

హనుమకొండ సీఎం సభలో అర్జున అవార్డు గ్రహీతలు

image

హనుమకొండలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సభలో బాక్సింగ్ ఒలింపిక్స్ పోటీల్లో అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్, షూటింగ్‌లో ఒలింపిక్స్ పోటీల్లో అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున అవార్డు గ్రహీతలతో హన్మకొండ జిల్లాకు చెందిన క్రీడాకారులు కొద్దిసేపు మాట్లాడారు.