India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వరాష్ట్రంలో.. ప్రజా పాలనలో గేయాలను, గొప్ప వ్యక్తులను గౌరవించుకునే అవకాశం నాకు దక్కిన అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. జయ జయహే తెలంగాణ నుంచి ప్రశ్నించే కాళోజీ వరకుజనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాల్సిన అంశాలు అని సీఎం అన్నారు. వరంగల్ కాళోజీ కళాక్షేత్రం.. ఇకపై సాహిత్య సౌరభాలను వెదజల్లుతుందని, ప్రశ్నించే తత్వానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం ‘X’లో పంచుకున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో సూక పల్లికాయ క్వింటాకి రూ.4,100 ధర రాగా.. పచ్చి పల్లికాయకు రూ.5,651 ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటాకి రూ.12,627 పలికిందని అధికారులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.
హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి సభ ప్రారంభమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని మహిళలు, కాంగ్రెస్ శ్రేణులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కార్యక్రమానికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారదా దేవి, పీ. ప్రావీణ్యలు సీఎంకు స్వాగతం పలికారు. వారు సీఎంకు పూలబొకేలు అందజేశారు. అనంతరం రెండు జిల్లాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి గురించి వారు సీఎంకు వివరించారు.
హన్మకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అనంతరం కాళోజి కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న ధర నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా మక్కలు (బిల్టి) ధర రూ. 2,425 పలకగా నేడు (మంగళవారం) రూ.5 పెరిగి రూ.2,430కి చేరింది. అలాగే 341 రకం కొత్తమిర్చి నేడు మార్కెట్‌కి తరలిరాగా క్వింటాకు రూ. 13,500 ధర పలికిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్నటి లాగే ఈరోజు కూడా రూ.15,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు సోమవారం రూ.14 వేలు ధర రాగా.. నేడు రూ.15 వేలకు పెరిగింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి సోమవారం రూ.15,000 పలకగా నేడు రూ.14,500 పలికింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. గత వారం గరిష్ఠంగా రూ.7,000 పలికిన క్వింటా కొత్త పత్తి ధర.. సోమవారం భారీగా పతనమై రూ.6,750కి పడిపోయింది. నేడు మరింత తగ్గి రూ.6,730 కి చేరింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు మండలాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా అన్ని పాఠశాలల యాజమాన్యాలు తప్పక సెలవు ప్రకటించాలని డీఈఓ సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆంక్షలు ఉన్నాయని, వాహనదారులు అవసరం ఉంటే తప్ప తమ వాహనాలను రోడ్డు పైకి తీసుకరావద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ పరిసరాల వద్ద కఠినమైన ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం సమావేశం ముగిసే వరకు కొనసాగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.