Warangal

News August 4, 2024

రాజన్న ఆలయంలో రేపటి నుంచి బ్రేక్ దర్శనాలు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి బ్రేక్ దర్శనాలను ఈనెల 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు సార్లు ఉ.10:15 నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయని, ఒక్కొ టికెట్‌పై రూ.300 ఛార్జీ, ఒక లడ్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

News August 4, 2024

2026 మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్ష

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో 2026లో జరిగే మేడారం మహాజాతర ఏర్పాట్లపై ములుగు జిల్లా అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.

News August 4, 2024

ఈనెల 7న రామప్పలో హుండీల లెక్కింపు

image

ఈనెల 7న రామప్ప దేవాలయం హుండీలను లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉ. 10 గంటలకు దేవస్థానం మండపంలో లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు సిబ్బంది, అర్చకులు, సంబంధిత అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

News August 4, 2024

వరంగల్: రేపటి నుంచి పలు రైళ్ల రాకపోకలు బంద్

image

మూడో లైన్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు 5 నుంచి 10 వరకు కొన్ని రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను వరంగల్ రాకుండా దారి మళ్లించింది. సికింద్రాబాద్-వరంగల్-గుంటూరు మధ్య రాకపోకలు సాగిస్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-వరంగల్-విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్, పుష్పుల్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు వరంగల్ రైల్వే అధికారులు తెలిపారు.

News August 4, 2024

జనగామ: సిద్దులగుట్ట ప్రత్యేకత తెలుసా..?

image

జనగామ జిల్లా బచ్చన్నపేట మం. కొడవటూరులోని సిద్దులగుట్ట ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ మహిమాన్వితమైన పుట్టులింగం ఉంది. ఇది భూమిలో నుంచి పుట్టిందని, అందుకేదీన్ని పుట్టులింగం అని పిలుస్తారని స్థానికులు చెబుతున్నారు. సుమారు 3 శతాబ్దాలుగా ఆ పుట్టులింగం చింతాకు పరిమాణంలో పెరుగుతూ వస్తుందట. ఆలయ సమీపంలో ఉన్న బావిలోని నీరు తాగితే కామెర్ల వ్యాధి తగ్గుతుందని భక్తుల నమ్మకం. మీరు ఇక్కడికి వెళ్తే కామెంట్ చేయండి.

News August 4, 2024

జనగామ: సిద్దులగుట్ట ప్రత్యేకత తెలుసా..?

image

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరులోని సిద్దులగుట్ట ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో మహిమాన్వితమైన పుట్టులింగం ఉంది. ఇది భూమిలో నుంచి పుట్టిందని, అందుకే దీన్ని పుట్టులింగం అని పిలుస్తారని స్థానికులు చెబుతున్నారు. సుమారు మూడు శతాబ్దాలుగా ఆ పుట్టులింగం చింతాకు పరిమాణంలో పెరుగుతూ వస్తుందట. ఆలయ సమీపంలో ఉన్న బావిలోని నీరు తాగితే కామెర్ల వ్యాధి తగ్గుతుందని భక్తుల నమ్మకం. 

News August 4, 2024

వరంగల్: పోస్ట్ మాస్టర్ సస్పెండ్

image

వరంగల్‌లోని మొగిలిచర్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సున్నం శ్వేత సస్పెండ్ అయ్యారు. ప్రజలకు సంబంధించిన డబ్బులను శ్వేత వాడుకున్నారే ఫిర్యాదులు వచ్చినట్లు వరంగల్ సౌత్ సబ్ డివిజన్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమె వద్ద ఎవరూ డిపాజిట్లు చేయెద్దని సూచించారు.

News August 4, 2024

Friendship Day Special.. వరంగల్: యువకుడి ప్రాణాలు కాపాడిన మిత్రులు

image

పురుగు మందు తాగిన ఓ యువకుడిని మిత్రులు కాపాడిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. SI హరీశ్ ప్రకారం.. WGLలోని రామన్నపేటకు చెందిన సాయికృష్ణ ఐదేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది వాజేడు మం.లోని బొగ్గులవాగు సమీపంలో శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. స్పందించిన మిత్రులు పోలీసులకు సమాచారమివ్వడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

News August 4, 2024

వరంగల్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే ఓరుగల్లు వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day

News August 4, 2024

మహబూబాబాద్: ఆగస్టు 5న ప్రజావాణి రద్దు

image

కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఆగస్టు 5న సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా దీనిని ప్రజలు గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.