Warangal

News November 16, 2024

WGL: సీఎం పర్యటన పనులను పరిశీలించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, GWMC అశ్విని తానాజీ వాకడే శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

News November 16, 2024

హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం!

image

హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. పరకాల మండలం రాజుపేట పంటపొలాల్లో చిరుత సంచరించినట్లు రైతులు అనుమానానిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని పరిశోధిస్తున్నారు.

News November 16, 2024

WGL: విభిన్న తరహాలో ట్రాన్స్‌జెండర్ మోసం

image

శుభకార్యాలకు వచ్చి పలువురు ట్రాన్స్‌జెండర్లు డబ్బులు తీసుకుంటారు. కానీ ఈ ట్రాన్స్‌జెండర్ వేరు. CI దామోదర్ కథనం మేరకు.. జనగామ వాసి సిరివెన్నెలకు కొత్తగూడెం వాసి,ట్రాన్స్‌జెండర్ నాగదేవి పరిచయమైంది. ఇటీవల ఆమెకు <<14617456>>మీ ఇంట్లో దోషం<<>> ఉందని నాగదేవి చెప్పింది.దోష నివారణకు మేడ్చల్‌లోని ఆమె తమ్ముడి నిఖిల్ ఇంట్లో పూజలు చేసి రూ.55లక్షలు వసూలు చేసింది. మోసపోయామని తెలుసుకున్న వారు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News November 16, 2024

నేడు హనుమకొండకు టీపీసీసీ చీఫ్ రాక

image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేడు హన్మకొండ నగరానికి రానున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్ లు, డిసిసి అధ్యక్షులు, ముఖ్య నేతలతో పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చీఫ్ సమీక్ష నిర్వహించనున్నారు.

News November 15, 2024

వర్ధన్నపేట: కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన అఘోరి

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో శుక్రవారం నాగసాదు అఘోరి పర్యటించింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఇల్లందలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించింది. కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేసింది. కాలభైరవ ఆలయానికి నాగసాదు అఘోరి వచ్చిందన్న విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అఘోరిని చూసేందుకు తరలివచ్చారు.

News November 15, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు

image

ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శుక్రవారం పరిశీలించారు. హెలికాప్టర్ దిగనున్న ఆర్ట్స్ కళాశాల మైదానంతో పాటు బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం, కాజీపేట ఆర్వోబీని కలెక్టర్లు పరిశీలించారు.

News November 15, 2024

HNK: అంబులెన్సులో ప్రసవం.. సీపీఆర్ చేసి బిడ్డను కాపాడిన సిబ్బంది

image

ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే ప్రసవించగా.. 108 సిబ్బంది సీపీఆర్ చేసి చలనం లేని బిడ్డను కాపాడారు. HNK జిల్లా వేలేరు మండలం లోక్యా తండాకు చెందిన భూక్య అఖిల ఆరు నెలల గర్భిణి. ఆమెకు గురువారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అఖిల.. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువులో చలనం లేకపోవడంతో 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. తల్లీబిడ్డలను ఆస్పత్రిలో చేర్పించారు.

News November 15, 2024

నేడు పాలకుర్తిలో అఖండజ్యోతి 

image

కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించే అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు. తిరువన్నామలై అరుణాచలం స్ఫూర్తితో పాలకుర్తి ఆలయ గుట్టపై 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యశస్వని రెడ్డి హాజరుకానున్నారు.

News November 15, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై చర్యలు: కలెక్టర్ ప్రావీణ్య

image

హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో చట్టం అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఇప్పటి వరకు నమోదైన కేసులు, జిల్లాలో బాల, బాలికల నిష్పత్తిని గురించి సమీక్షించారు. లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News November 14, 2024

హనుమకొండ: శివయ్య శిరస్సుపై జాబిల్లి

image

హనుమకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు లింగం శ్రీ సిద్దేశ్వర ఆలయంలో అరుదైన దృశ్యం కనిపించింది. సాయంకాలం సంధ్యా సమయంలో కార్తీక పౌర్ణమి ఘడియల్లో శివయ్య శిరస్సుపై జాబిల్లి విరజిల్లుతున్నట్లు కనిపించింది. పలువురు భక్తులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బంధించారు.