News July 12, 2024

‘ఎమర్జెన్సీ’కి కారణమిదేనా?1/2

image

దేశ భద్రతకు ముప్పు వాటిల్లడమే ఎమర్జెన్సీకి కారణమని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానికి మరో కారణం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. రాయ్‌బరేలీలో ఇందిరా గాంధీపై రాజ్ నారాయణ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పోలీసులతో పాటు కొందరు అధికారులు ఇందిర విజయానికి పనిచేశారని.. డబ్బు, మద్యం పంచారని ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నారాయణ్‌ పిటిషన్‌ను కోర్టు స్వీకరించడమే ఎమర్జెన్సీకి దారితీసింది.

Similar News

News December 2, 2025

కగార్ దెబ్బ.. PLGA వారోత్సవాలు లేనట్లే!

image

ఏటా డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తున్న నక్సల్స్ PLGA వారోత్సవాలు ఈ ఏడాది నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. మావోల లొంగుబాటు, అగ్రనేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగాల్సిన సంస్మరణ వారోత్సవాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, 1999 కొయ్యురు ఉమ్మడి కరీంనగర్ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ముగ్గురు ముఖ్యనేతల త్యాగాలకు గుర్తుగా 2000 సంవత్సరం నుంచి ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.

News December 2, 2025

NDAలోకి విజయ్ దళపతి?

image

తమిళనాడులో NDA కూటమిలోకి TVK చీఫ్ విజయ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉండొచ్చని అన్నాడీఎంకే చీఫ్ <<17963359>>పళనిస్వామి <<>>గతంలో సంకేతాలిచ్చారు. అయితే కూటమిలో చేరుతున్నామనే వార్తలను TVK ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కూటమిగా వెళ్తేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.

News December 2, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్