News July 20, 2024
స్త్రీలలో జుట్టు రాలడానికి కారణాలివే!

జుట్టు రాలడం మహిళల్లోనూ బాగా పెరిగింది. దీనికి ఒత్తిడి, ఆందోళన ప్రధాన కారణాలని త్రయా అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. 2.8 లక్షలమందిపై చేసిన సర్వేలో 71.19శాతం మంది జుట్టు బాగా రాలుతోందని చెప్పారు. పురుషులతో సమానంగా రాణిస్తున్న స్త్రీలకు హెయిర్ ఫాల్ కూడా సమానంగానే ఉంటోంది. వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడం, దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా కొంతమేర సమస్యను తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 16, 2025
ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు?

TG: వచ్చే ఏడాది APR నుంచి పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధ్యాప్య, వితంతు తదితర పెన్షనర్లు 44లక్షల మంది ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వారికోసం ₹11,635Cr కేటాయించింది. పెంపు జరిగితే ₹22K Cr కావాల్సి ఉండగా నిధుల సమీకరణ మార్గాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఒకేసారి పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయనుంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ ₹2,016 ఇస్తుండగా హామీ మేరకు ₹4వేలు చేయాల్సి ఉంది.
News December 16, 2025
ధనుర్మాసం ఆరంభం.. విష్ణుమూర్తికి పూజ చేస్తే!

విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. ఈ నెల రోజులు భక్తులు కఠిన నియమాలను పాటిస్తూ శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందే పూజలు చేస్తుంటారు. దైవారాధనకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదు. ధనుర్మాస వ్రతనిష్ఠతో విష్ణులోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
News December 16, 2025
విజయ్ దివస్.. యుద్ధ వీరులకు మోదీ, రాజ్నాథ్ నివాళులు

1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భారత్కు విజయాన్ని అందించిన సాయుధ దళాలను ‘విజయ్ దివస్’ సందర్భంగా PM మోదీ స్మరించుకున్నారు. ఇది దేశ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగాలు దేశాన్ని కాపాడాయని, ఈ విజయం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని Xలో ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తూ.. ఈ విజయం త్రివిధ దళాల సమన్వయానికి ప్రతీక అని అన్నారు.


