News December 31, 2024

జాగ్రత్త.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

image

తెలంగాణలో పోలీసులు ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే ₹10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే ₹15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. సో.. ఆల్కహాల్ సేవిస్తే డ్రైవ్ చేయకండి.

Similar News

News January 15, 2026

‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’.. ట్రంప్‌కు హెచ్చరిక

image

ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్‌ (Islamic Republic State TV) ట్రంప్‌కు హెచ్చరికలు చేస్తూ సంచలన ప్రసారాలు చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం దృశ్యాలను టెలికాస్ట్ చేస్తూ, ‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’ అంటూ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రసారం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.

News January 15, 2026

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News January 15, 2026

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

image

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.