News March 31, 2025
CBG ప్లాంట్లు.. ఎకరానికి రూ.31వేల కౌలు: గొట్టిపాటి

APలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లుండి కనిగిరిలో CBG తొలి యూనిట్కు అనంత్ అంబానీ, లోకేశ్ శంకుస్థాన చేస్తారన్నారు. త్వరలో మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేల కౌలు అందిస్తామని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
శ్రేయస్ అయ్యర్ సరికొత్త ఘనత

ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరో ఘనత సాధించారు. టోర్నీలో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన మూడో కెప్టెన్గా అయ్యర్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 72 మ్యాచులకు సారథ్యం వహించి 55.55% విజయాలు సాధించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (55.06%) రికార్డును ఆయన అధిగమించారు. ఈ జాబితాలో ధోనీ (58.84%) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సచిన్ (58.82%) కొనసాగుతున్నారు.
News April 2, 2025
వక్ఫ్ సవరణ బిల్లు.. మీ అభిప్రాయం?

వక్ఫ్ అంటే ముస్లింలు చేసే దానం. ఎక్కువగా స్థిరాస్తి రూపంలోనే ఉంటుంది. 9.4 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయని అంచనా. వాటిలో చాలావాటికి పత్రాలు లేకపోవడం వివాదాస్పదమవుతోంది. ఒక ఆస్తిని వక్ఫ్గా నిర్ణయిస్తే దానిపై సర్వాధికారాలు వక్ఫ్ బోర్డువే. ఆ అధికారాల్ని తగ్గించి బోర్డుల్ని చట్టం పరిధిలోకి మరింతగా తీసుకొచ్చేలా కేంద్రం నేడు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆ సవరణపై మీ అభిప్రాయం? కామెంట్ చేయండి.
News April 2, 2025
దేశంలో 13వేల చదరపు కి.మీ.ల అటవీ భూముల కబ్జా

దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా MPలో 5,460.9 Sqkm భూములు కబ్జాకు గురైనట్లు నివేదికలో తెలిపింది. APలో 133.18 చదరపు కి.మీల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంది. మొత్తం ఆక్రమిత భూముల్లో 409.77 Sqkm తిరిగి స్వాధీనం చేసుకున్నామంది. కాగా తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వివరాలు ఇవ్వలేదని తెలిపింది.