News April 1, 2025
CBG యూనిట్లతో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు: టీడీపీ

AP: రాబోయే ఐదేళ్లలో రిలయన్స్ కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్(CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని TDP వెల్లడించింది. రేపు కనిగిరిలో CBG యూనిట్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారని తెలిపింది. ‘ఈ ప్లాంట్లకు అనుబంధంగా ఎనర్జీ ప్లాంటేషన్ ద్వారా 5L ఎకరాల బంజరు భూమి ఉపయోగంలోకి వస్తుంది. దీనివల్ల 2.5L మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏటా 40L మె.టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది’ అని పేర్కొంది.
Similar News
News April 3, 2025
HEADLINES

వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా
AP: వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌ల స్థాపనే లక్ష్యం: CM CBN
AP: వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం: జగన్
TG: HCU భూములపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
TG: బీసీల డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోవాలి: CM రేవంత్
TG: LRS రాయితీ గడువు పొడిగింపు
TG: భవిష్యత్ తరాల కోసం HYDని నాశనం చేస్తారా?: KTR
News April 3, 2025
ఆరు నెలల్లో రెండు ఎయిర్‌పోర్టులు సాధించాం: కోమటిరెడ్డి

TG: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు IAF గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల్లో 2 ఎయిర్‌పోర్టులు(మామునూర్, ఆదిలాబాద్) సాధించడం తమ ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితమన్నారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందేలా IAFతో కలిసి తదుపరి కార్యాచరణపై నివేదిక రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
News April 3, 2025
IPL: ఆర్సీబీ ఓటమి

బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.