News August 27, 2024
వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ యూకే వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. పర్యటన వివరాలతో పాటు ఫోన్ నంబర్, మెయిల్ డీటెయిల్స్ కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఐదేళ్ల కాలపరిమితితో కొత్త పాసుపోర్టు జారీకి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు జగన్ యూకేలో పర్యటించనున్నారు. అక్కడ చదువుతున్న తన కుమార్తెను ఆయన కలవనున్నారు.
Similar News
News December 4, 2025
పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్‌పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్‌తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<


