News March 19, 2025

CBI, ED హోంశాఖ పరిధిలోకి రావు: అమిత్ షా

image

కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ హోంశాఖ పరిధిలోకి రావని ఆ శాఖ కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే సీబీఐ హోంమంత్రిత్వశాఖ కొమ్ము కాస్తోందని ఆరోపించారు. దీనిపై అమిత్ షా స్పందించి సమాధానమిచ్చారు. సీబీఐపై తప్పుడు సమాచారం మానేయాలని హితవు పలికారు. గోఖలే ప్రస్తావిస్తున్న ఎన్నికల హింసలకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు నమోదైనవని తెలిపారు.

Similar News

News October 16, 2025

ఎల్లుండి బంద్.. స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయా?

image

TG: బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నెల 18న బంద్ ప్రభావం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగైతే స్కూళ్లు, కాలేజీలకు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.

News October 16, 2025

సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

image

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో-9ను జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు కాగా జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

News October 16, 2025

పీరియడ్స్ వాయిదా వేసే టాబ్లెట్స్ వాడుతున్నారా?

image

ప్రస్తుతకాలంలో చాలామంది పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసే టాబ్లెట్లు వాడుతున్నారు. కానీ వీటిని ఎక్కువగా వాడటం వల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో గర్భస్థ శిశువుకి జననేంద్రియ లోపాలు రావచ్చంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే మహిళలు వీటిని వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే డాక్టర్‌ సలహా మేరకు వాడడం మంచిదని సూచిస్తున్నారు.